2రోజులు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ లు వాడొద్దు…రాష్ట్రాలను కోరిన ICMR

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2020 / 11:35 AM IST
2రోజులు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ లు వాడొద్దు…రాష్ట్రాలను కోరిన ICMR

రాబోయే రెండు రోజుల పాటు కరోనా వైరస్ పరీక్షల కోసం అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను వాడటం మానేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్(ICMR)సూచించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లలో లోపాలను గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ ల ద్వారా సరైన ఫలితాలు రావడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ర్యాపిడ్ టెస్ట్ కిట్ లలో లోపాలపై విచారణ జరపునున్నట్లు కేంద్రం తెలిపింది. ఐసీఎంఆర్ కు చెందిన 8బృందాలు ర్యాపిడ్ టెస్ట్ కిట్ లను పరిశీలించనుంది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లను ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాయి. అయితే వేగవంతంగా టెస్టింగ్ ఫలితాలు వస్తున్నా అవి సరిగా రావడం లేదని, 6నుంచి 71శాతం వరకు ఫలితాల్లో తేడాలు వస్తున్నాయని,కరోనా లేనివాళ్లకు కూడా పాజిటివ్ అని టెస్ట్ లలో వస్తుందని,దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనే అవకాశముందని,వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశముందని రాష్ట్రాల నుంచి కేంద్రానికి అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఐసీఎంఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్రాలు రెండు రోజుల వరకు ర్యాపిడ్ కిట్ లను వాడవద్దని ఐసీఎంఆర్ సూచించింది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్ కిట్లపై ఆరోపణలు వస్తున్నాయి. యాంటీబాడీ ర్యాపిడ్ టెస్టింగ్ లపైన పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతనే వాటి వాడకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

అయితే ఇప్పటికే ర్యాపిడ్ కిట్ లతో టెస్ట్ లు చేయకూడదని రాజస్థాన్ నిర్ణయించింది. చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ లను వాడబోమని ఐసీఎంఆర్ కు రాజస్థాన్ ప్రభుత్వం లేఖ రాసింది. చైనా ర్యాపిడ్ కిట్లు 5.4శాతం మాత్రమే పలితాస్తున్నాయని అశోక్ గోహ్లోత్ ప్రభుత్వం ప్రకటించింది. పీపీఆర్ టెస్టింగ్ విధానంలోనే కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు రాజస్థాన్ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 4,49,810శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.