Minister Seediri Appalaraju : నేను ఒక్క అడుగు భూమినైనా ఆక్రమించినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుండి తప్పుకుంటా : మంత్రి సీదిరి అప్పలరాజు

తాను ఒక్క అడుగు భూమినైనా ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు తన నిజాయితీకి భంగం కలిగించే వార్తలు ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు.

Minister Seediri Appalaraju : నేను ఒక్క అడుగు భూమినైనా ఆక్రమించినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుండి తప్పుకుంటా : మంత్రి సీదిరి అప్పలరాజు

Seediri Appalaraju

Minister Seediri Appalaraju : తాను ఒక్క అడుగు భూమినైనా ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు తన నిజాయితీకి భంగం కలిగించే వార్తలు ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు. పలాస నియోజకవర్గంలో భూ సమస్యలకు సంబంధించి ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. భూ ఆక్రమణలు వాస్తవం అయితే వాటిని తొలిగించాలని జిల్లా కలెక్టర్ ను కోరానని చెప్పారు. పలు భూములు ఆక్రమణలు జరిగినట్టు ఫిర్యాదులు అందాయని తెలిపారు.

టీడీపీకి చెందిన వార్డు, గ్రామ స్థాయి నాయకులు ఆక్రమణలు పెద్ద ఎత్తున బయటపడ్డాయన్నారు. ఎక్కడైనా తాను ఒక ఇంచ్ ఆక్రమించినా, తన అనుచరులు ఒక్క అడుగు భూమి ఆక్రమించినా.. వెంటనే తొలిగించి, రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు. తన బ్యాక్ ఎండ్ టీం తప్పు చేస్తే తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. గౌతు కుటుంభం పేరు చెప్పి 4దశాబ్దాలుగా అభివృద్ధి లేకుండా చేశారని విమర్శించారు.

Seediri Appalaraju : వచ్చే ఎన్నికల్లో 175 స్ధానాలు వైసీపీవే- మంత్రి సీదిరి అప్పలరాజు

తాను వచ్చాక సీఎం జగన్ ప్రోత్సాహంతో పలాస నియోజకవర్గంలో అభివృద్ధి ఏమిటో పరుగులు పెట్టి చూపించానని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే తాము సహించబోమని చెప్పారు. 15 వందల ఎకరాలు ఆక్రమించానని ఓ పత్రిక వ్రాసిందని, ఆ సర్వే నెంబర్ భూములు 2012లో ఆక్రమణ జరిగిందని రాశారని అప్పుడు ఎమ్మెల్యే గౌతు శివాజీ దానికి బాధ్యులు కాదా అని ప్రశ్నించారు.

ఎవరు ఆక్రమించున్నారో వాళ్ళ పేర్లతో కంప్లైంట్ ఇవ్వాలన్నారు. గౌతు శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలాస లో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయ్యాక వ్యాపార వర్గాలకు అండగా ఉన్నానని పేర్కొన్నారు. ఇప్పుడు నగరంలో కొత్త వ్యాపారాలు విస్తరించాయని పేర్కొన్నారు.