నిప్పుల కుంపటి : ఏపీలో 45 డిగ్రీలు 

  • Published By: veegamteam ,Published On : April 15, 2019 / 05:05 AM IST
నిప్పుల కుంపటి : ఏపీలో 45 డిగ్రీలు 

అమరావతి : ఎండాకాలం..మండిపోతున్న ఎండలు..అల్లాడిపోతున్న ప్రజలు..రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆంద్రప్రదేశ్ పై తన ప్రతాపాన్ని చూపుతు..ఉదయం 8 గంటలకే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎండలు మండిపోతున్నాయి.  ఈ క్రమంలో ఏపీలో ఈరోజు (ఏప్రిల్ 15) 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయిని వాతావరణ శాఖ తెలిపింది.ఇవి ఇంకా పెరిగే అవకాశాలున్నాయని కాబట్టి ..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటనే జంకుతున్నారు. సాధారణంగానే అధిక ఉష్ణోగ్రతలుండే దక్షిణాంధ్రలో పరిస్థితి దారుణంగా మారిపోయి 45 డిగ్రీలు దాటేసే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు  సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాలలో వేడి గాలులైతే ప్రజల దేహాలలో తేమని పీల్చేస్తున్నాయి.

 

ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా పదిజిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక హైదరాబాద్‌ లో 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు తోడు కాంక్రీట్‌ మహారణ్యంగా మారిపోవటంతో అతినీల లోహిత కిరణాల తీవ్రత భారీగా పెరిగింది. ఎండవేడికి ప్రజలు బయటకు రావడానికి కూడా జంకుతుండగా.. మరోపక్క ఎన్నికలు పూర్తయిన తరువాత శని..ఆదివారాలు రావటంతో స్వగ్రామాలకు వెళ్లిన నగర ప్రజలు ఇంకా తిరిగి నగరానికి పూర్తిగా రాకపోవడంతో ఆదివారం (ఏప్రిల్ 14)న  పగలు నగర రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు  మరో రెండు రోజులు ఇలాగే ఉంటాయని వాతావరణ నిపుణులు తెలిపారు.