ఇండియాను చూసి చాలా దేశాలు కుళ్లుకుంటున్నాయి: సీఎం జగన్

  • Published By: Subhan ,Published On : June 19, 2020 / 03:53 PM IST
ఇండియాను చూసి చాలా దేశాలు కుళ్లుకుంటున్నాయి: సీఎం జగన్

ఇండియా-చైనా బోర్డర్ అంశంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ‘ప్రధాని మోడీకి థ్యాంక్స్. విశ్వవ్యాప్తంగా ఇండియా రెప్యుటేషన్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సత్సంబంధాలు నెలకొల్పుతున్నారు. మీరు మా బలం. భారత్‌ను చూసి చాలా మంది కుళ్లుకుంటున్నారు. చైనా ఇండియాను అస్థిరపరచాలనుకుంటుంది’ అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. 

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మీటింగ్ లో పాల్గొన్న ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు మనమంతా ఒక్కటే కలిసి పోరాడదామనే భావనను వెలిబుచ్చారు. ప్రధాని నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చైనాతో కలిసి పోరాడితేనే విజయం సాధిస్తామని అన్నారు. 

గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ సైనికుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం వహించి సమావేశం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రితో పాటుగా తెలుగు సీఎంలు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాకరే, జేపీ నద్దా, నితిష్ కుమార్, స్టాలిన్, సుఖ్బిర్ సింగ్ బాదల్, డి.రాజా,  ప్రేమ్ సింగ్ తమాంగ్ తదితరులు పాల్గొన్నారు.