కోవిడ్ నిర్ధారణ కేంద్రాలుగా ఇంద్ర బస్సులు

  • Published By: bheemraj ,Published On : July 10, 2020 / 09:30 PM IST
కోవిడ్ నిర్ధారణ కేంద్రాలుగా ఇంద్ర బస్సులు

ఏపీలో కరోనా ఎఫెక్ట్ తో అన్ని విధాలుగా ఆర్టీసీ నష్టపోయింది. నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ప్రగతి చక్రాలు..ఇప్పుడు రోజుకు రెండు లక్షల మందిని మాత్రమే తీసుకెళ్తున్నాయి. మార్చి 23న నిలిచిపోయిన ప్రగతి చక్రాలు నేటికి పూర్తిస్థాయిలో పరుగులు పెట్టడం లేదు. ఏపీ ప్రభుత్వం కరోనా నిబంధనలతో కొన్ని రూట్లలో బస్సులు తిప్పమని ఆదేశాలివ్వడంతో కొన్ని రోజుల నుంచి ఆర్టీసీ లిమిటెడ్ సర్వీసులు నడుపుతోంది. ఈ సర్వీసుల్లో కూడా ప్రయాణికులు పూర్తిస్థాయిలో లేకపోవడం ఆర్టీసీకి ఆర్థికంగా మరింత భారంగా మారింది.

అయినా ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కొన్ని సర్వీసులను నడుపుతోంది. రోడ్డెక్కిన బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా పూర్తిస్థాయిలో లేకపోవడం మరింత నష్టాల బాటలో పయనిస్తోంది. మరికొన్ని నెలలపాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న ఆలోచనలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల బాట పట్టారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చే విధంగా 25 బస్సులను స్పెషల్ గా తయారు చేసి డ్రైవింగ్ స్కూల్స్ కు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వీసీ, ఎండీ మాసిరెడ్డి ప్రతాప్ చెప్పారు.

మరోవైపు కార్గో, సంచార బస్సుల ద్వారా ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయం ఆర్జించే విధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఆర్టీసీ నాలుగు నెలల్లో రూ.4200 కోట్లతో నష్టపోయినట్లు చెప్పారు. ఇటు కార్గో, సంచార బస్సులు డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా కోవిడ్ కోల్పోయిన ఆదాయాన్ని ఆయన రాబట్టేందుకు ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేస్తామని ఎండీ చెప్పారు.

మరోవైపు ప్రజలకు సేవ చేసే అంశంలో ఎప్పుడు ముందుంటే ఆర్టీసీ సంస్థ కరోనా ప్రమాదకర పరిస్థితుల్లో కూడా కీలకమైన అవసరాలకు బస్సులను సిద్ధం చేస్తోంది. ఇంద్ర బస్సుల్లో కొద్దిపాటి మార్పులు చేసి సంజీవని పేరుతో కరోనా పరీక్షలకు బస్సులను ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఒక్కొక్క జిల్లాకు నాలుగు బస్సుల చొప్పున వీటిని పంపుతారు. అక్కడి జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకుని ఈ బస్సుల్లోనే కోవిడ్ వైద్య పరీక్షలు చేస్తారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బస్సులు నడపటం వల్ల ఆర్థిక నష్టమే కాకుండా ఉద్యోగులకు కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఏపీలో మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. తెలంగాణకు సర్వీసులు నడపాలని భావించినా రెండు రాష్ట్రాల మధ్య చర్చలకు ఆటంకం కరోనా ఆటంకం కల్గించడంతో తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు పున:రుద్ధరణ కాలేదు. అదే విధంగా బెంగళూరు కూడా సర్వీసులు నడుపాలని ఏపీ ప్రభుత్వం భావించినా కొన్ని సాంకేతి పరిస్థితుల కారణంగా సాధ్యమవ్వలేదు.