Andhra Pradesh : అటు యాత్రలు, ఇటు పర్యటనలు.. రంగంలోకి పవన్ కల్యాణ్, అమిత్ షా.. ఏపీలో వేడెక్కిన రాజకీయాలు
Andhra Pradesh : బీజేపీ అగ్రనేతలు కూడా ఏపీపై ఫోకస్ పెట్టారు. పవన్ కల్యాణ్ సైతం జనాల్లోకి వెళ్లనున్నారు. వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు.

Andhra Pradesh (Photo : Google)
Andhra Pradesh – Political Heat : ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ, అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరుగుతోంది. ఓవైపు నేతల యాత్రలు, మరోవైపు పర్యటనలు, మేనిఫెస్టో ప్రకటనలు.. ఏపీలో రాజకీయాలను రసవత్తరంగా మార్చేశాయి. లోకేశ్ పాదయాత్ర, టీడీపీ మేనిఫెస్టోతో ఇప్పటికే రాజకీయం రంజుగా మారింది.
అటు ఏపీ సీఎం జగన్ కూడా వరుస సభలతో జనాల్లోకి వెళ్తున్నారు. టీడీపీ, జనసేన టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మేము సైతం అంటూ బీజేపీ అగ్రనేతలు కూడా ఏపీపై ఫోకస్ పెట్టారు. బీజేపీ అగ్ర నాయకులు ఏపీలో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. బీజేపీ అగ్ర నేతలు ఈ నెలలో ఏపీకి రానున్నారు.
Also Read..TDP Manifesto: టీడీపీ మ్యానిఫెస్టోపై వైసీపీ ఇంతలా రియాక్ట్ కావాల్సిన అవసరముందా?
జూన్ 8న విశాఖకు అమిత్ షా వస్తుండగా, జూన్ 10న తిరుపతికి జేపీ నడ్డా రాబోతున్నారు. మోదీ 9ఏళ్ల పాలనపై ఏపీలో రెండు భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ నెల 8న విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. 10న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహిపై యాత్రకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. వారాహి యాత్ర కోసం ఇప్పటికే పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్స్ కు కూడా బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల రెండో వారంలో వారాహి యాత్ర ప్రారంభం కాబోతోంది. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశమై వారాహి యాత్రపై చర్చించారు నాదెండ్ల మనోహర్.