‘మన పాలన-మీ సూచన’ పేరుతో ఏపీలో మేథోమధన సదస్సులు

  • Published By: vamsi ,Published On : May 25, 2020 / 02:07 AM IST
‘మన పాలన-మీ సూచన’ పేరుతో ఏపీలో మేథోమధన సదస్సులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం ముగియ వస్తుంది. ఈ క్రమంలోనే ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. రివర్స్ టెండరింగ్‌లు.. ఆయా రంగాల్లో ప్రభుత్వం తీసుకుని వచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ‘మన పాలన-మీ సూచన’ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మేథోమధన సదస్సులు నిర్వహిస్తోంది.

ఈ మేరకు నేటి(25 మే 2020) నుంచి ఈనెల 30వ తేదీ వరకు రోజూ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మేథోమధన సదస్సులు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మే 30వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతుంది. ‘పరిపాలన–సంక్షేమం’పై సీఎం అధ్యక్షతన మొదటి సదస్సు జరగనుంది. జిల్లా స్థాయిలో పథకాల లబ్ధిదారులు, ఆయా రంగాల నిపుణులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు.

ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఈ సదస్సు ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రారంభం కానుంది. సదస్సులో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స పాల్గొంటారు. పరిపాలన–సంక్షేమం, ఈ రెండు అంశాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలా అమలయ్యేవి? ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలనలో ఎలా ఉందో.. అనేవాటిపై సదస్సులు జరగనున్నాయి. 

Read: స్కూలుకెళ్లిన తొలిరోజే జగనన్న విద్యా కానుక