AP Inter Exams : జులై నెలాఖరులో ఏపీ ఇంటర్ పరీక్షలు !

ఇంటర్ పరీక్షలపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జూలై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది. ఒక్కో పరీక్షా కేంద్రలో 15 నుంచి 18 మంది విద్యార్ధులను ఉంచుతామని చెప్పింది.

AP Inter Exams : జులై నెలాఖరులో ఏపీ ఇంటర్ పరీక్షలు !

Ap Inter Exams

AP Inter Exams : ఇంటర్ పరీక్షలపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జూలై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది. ఒక్కో పరీక్షా కేంద్రలో 15 నుంచి 18 మంది విద్యార్ధులను ఉంచుతామని చెప్పింది.

టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సిధ్దంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో  దాఖలు చేసింది. రాష్ట్రంలో  కరోనా  కేసులు తగ్గుముఖం పడుతున్ననేపధ్యంలో పరీక్షల నిర్వహణకే  ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. కోవిడ్ నింబంధనలు అమలు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలునిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.

పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పరీక్ష  సమాధాన పత్రాల మూల్యాంకనం లో  కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తామని  ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కోంది. కాగా సుప్రీం నిర్ణయం తర్వాతే   ఏపీలో పరీక్షల  తేదీల గురించి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.