Inter 2nd Year Exams : ఇంటర్‌ సెకండియర్ ఎగ్జామ్స్‌ క్యాన్సిల్ అవుతాయా ?

ఇంటర్‌ ఎగ్జామ్స్‌ క్యాన్సిల్ అవుతాయా.. దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దయ్యాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ ఎగ్జామ్స్‌ క్యాన్సిల్ అవుతాయా? తెలంగాణ సర్కార్‌ యోచనేంటి? ఏపీ ప్రభుత్వం ప్లానేంటి? పరీక్షలకే మొగ్గు చూపుతారా...? పిల్లల్ని పాస్ చేస్తారా...?

Inter 2nd Year Exams : ఇంటర్‌ సెకండియర్ ఎగ్జామ్స్‌ క్యాన్సిల్ అవుతాయా ?

Inter

Inter Exams : ఇంటర్‌ ఎగ్జామ్స్‌ క్యాన్సిల్ అవుతాయా ? దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దయ్యాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ ఎగ్జామ్స్‌ క్యాన్సిల్ అవుతాయా? తెలంగాణ సర్కార్‌ యోచనేంటి? ఏపీ ప్రభుత్వం ప్లానేంటి? పరీక్షలకే మొగ్గు చూపుతారా…? పిల్లల్ని పాస్ చేస్తారా…? దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఇంకా తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టలేమంటూ కేంద్రం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ప్లస్ టు ఎగ్జామ్స్‌ రద్దు చేసింది. దీంతో రాష్ట్రాలు కూడా ఇంటర్ ఎగ్జామ్స్‌ రద్దు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. పెద్దసంఖ్యలో తల్లిదండ్రులు, లెక్చరర్లు కూడా రిస్క్‌ వద్దనే రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా టెన్త్ ఎగ్జామ్స్‌, ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు చేసిన తెలంగాణ సర్కార్ ఇంటర్ సెకండియర్ విషయంలోనూ అదే దిశగా అడుగులు వేస్తోంది. పరీక్షలను రద్దు చేసేందుకు రెడీ అవుతోంది. తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలవుతుండటం.. కరోనా కేసులు కొంతమేర తగ్గినా బ్లాక్‌ ఫంగస్‌ విజృంభిస్తుండటంతో పరీక్షలు రద్దు చేస్తేనే మంచిదని సర్కార్ యోచిస్తోంది.

తెలంగాణలో ఎఫ్ఏ-1 ఆధారంగా పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటిoచారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేశారు. సెకండ్ ఇయర్‌లో 4 లక్షల 73 వేలకు పైగా విద్యార్థులున్నారు. వీరికి గత విద్యా సంవత్సరం మార్కుల ఆధారంగా పర్సంటేజ్‌ ఇవ్వాలని అధ్యాపక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఫస్ట్‌ ఇయర్‌లో ఎవరైనా విద్యార్థులు ఫెయిలైతే వారిని 40 శాతం మార్కులతో పాస్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రెండు రోజుల్లో ఇంటర్ సెకండియర్‌ ఎగ్జామ్స్‌ రద్దుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఏపీ సర్కార్‌ మాత్రం పరీక్షల రద్దుకు ససేమిరా అంటోంది.

ఇప్పటివరకు టెన్త్‌ ఎగ్జామ్స్‌ కూడా రద్దు చేయలేదు. కోవిడ్‌ కేసులు పెరగడంతో టెన్త్‌, ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. విద్యార్థుల భవిష్యత్‌ కోసమే పరీక్షలను నిర్వహిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మంచి మార్కులుంటేనే మంచి కాలేజీల్లో సీట్లు దొరుకుతాయని చెబుతోంది. కోవిడ్ తీవ్రత తగ్గాక టీచర్లందరికీ వ్యాక్సిన్ వేయడం పూర్తిచేసి కోవిడ్‌ నిబంధనలు అమలు చేస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెబుతోంది.

అయితే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోగా పరీక్షల నిర్వహణ సాధ్యమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటు ఏపీలో విపక్షాలు పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రం సీబీఎస్‌ఈ ప్లస్‌ 2 పరీక్షలు రద్దు చేయడంతో ఏపీ సర్కార్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సర్కార్ ఏం నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

Read More : Special Vaccination : తెలుగు స్టేట్స్ లో వ్యాక్సినేషన్..విదేశాలకు వెళ్లే వారికి టీకాలు