Andhra Pradesh : వైసీపీని ఓడించటమే బీజేపీ లక్ష్యం : ఎంపీ జీవీఎల్

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందని ఏపీలో వైసీపీని ఓడించటమే బీజేపీ లక్ష్యం అని బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేక విధానాలను వైసీపీ ప్రోత్సహిస్తోంది అంటూ విమర్శించటం ఆసక్తికరంగా మారింది.

Andhra Pradesh : వైసీపీని ఓడించటమే బీజేపీ లక్ష్యం : ఎంపీ జీవీఎల్

Interesting comments of BJP MP GVL on YCP Govt

Andhra Pradesh : వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందని ఏపీలో వైసీపీని ఓడించటమే బీజేపీ లక్ష్యం అని బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేక విధానాలను వైసీపీ ప్రోత్సహిస్తోంది అంటూ విమర్శించారు.

కాగా ఇప్పటికే ఉత్తర భారతంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై కూడా పట్టుకోసం యత్నిస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే తెలంగాణలో చర్యలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. దీని కోసం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు జాతీయ బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తరచు తెలంగాణలో సభలు,సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలో కూడా బీజేపీ ప్రాభవాన్ని పెంచుకోవాలని యత్నిస్తోంది. కానీ తెలంగాణలో ఉన్నంత గట్టి నాయకత్వం ఏపీలో బీజేపీకి లేదనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఏపీ బీజేపీ నేతల మధ్య సమన్వయం లేకపోవటమే దీనికి కారణం.

దీంతో ఏపీలో వైసీపీపై బలమైన పోరాటం చేస్తున్న జనసేనతో పొత్తు పెట్టుకుని సీట్లు సాధించాలని చూస్తోంది బీజేపీ. జసనేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బీజేపీతోపొత్తు ఉంటుందని గతం నుంచి బీజేపీతో కొనసాగుతున్న మిత్ర బంధం కొనసాగుతుందని చెబుతున్నారు. కానీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ వారితో కలిసి పొత్తు పెట్టుకోదని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ ఏపీలో జనసేన తప్ప బీజేపీకి మరో ప్రత్నామ్నాయం లేదు పొత్తులకు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఎటువంటి ప్రభావాన్ని చూపించదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక వైసీపీని ఓడించటమే బీజేపీ లక్ష్యం అంటూ కొత్తగా బీజీపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించటం సంచలన కలిగిస్తోంది. ఎందుకంటే టీడీపీని, జనసేనను విమర్శించే వైసీపీ నేతలు బీజేపీపై మాత్రం ఎటువంటి విమర్శలు చేయరు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ అధిష్టానాన్ని విమర్శచే ధైర్యం వైసీపీ నేతలకే కాదు అధినేతకు కూడా లేదనేది వాస్తవం అంటారు ప్రతిపక్ష నేతలు. దీనికి కారణం వైసీపీ అధినేత జగన్ పై ఉన్న పలు ఆర్థిక నేరాల కేసులు.

గట్టిగా బీజేపీని విమర్శిస్తే ఎక్కడ తనకు మప్పు వస్తుందోనని తనపై ఉన్న కేసులకు భయపడే బీజేపీని జగన్ విమర్శించరని..తన నేతలకు కూడా అదే చెబుతుంటారని ఆరోపిస్తుంటారు ప్రతిపక్ష నేతలు. ఇక బీజేపీ కూడా టీడీపీపై విమర్శలు చేస్తుంది తప్ప అధికారంలో ఉన్న వైసీపీపై విమర్శలు చేయకపోవటం గమనించాల్సిన విషయం అనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఈ క్రమంలో వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందని ఏపీలో వైసీపీని ఓడించటమే బీజేపీ లక్ష్యం అని బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా  మారింది.