AP Politics : ప్రకాశం జిల్లా గిద్దలూరులో రసవత్తర రాజకీయం..వైసీపీ కంచుకోటను బద్దలు కొడతానంటున్న టీడీపీ నేత

ప్రకాశం జిల్లా గిద్దలూరులో రసవత్తర రాజకీయం..వైసీపీ కంచుకోటను బద్దలు కొడతానంటున్న టీడీపీ నేత అశోక్ రెడ్డి.

AP Politics : ప్రకాశం జిల్లా గిద్దలూరులో రసవత్తర రాజకీయం..వైసీపీ కంచుకోటను బద్దలు కొడతానంటున్న టీడీపీ నేత

Interesting Politics In Prakasam District Giddaluru..tdp Vs Ycp

AP Politics :పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు.. అలా కాకుండా.. వేరో చోట వెతుక్కుంటే.. మనం పోగొట్టుకున్నది దొరకదు. అలాగే.. ఓడిన చోటే గెలవాలి. గెలిచిన చోటే.. మళ్లీ మళ్లీ గెలవాలి. అప్పుడే.. మనతో అన్నీ ఉంటాయ్. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో.. ఇప్పుడు చెప్పినదాన్నే ఫాలోవుతున్నారు అక్కడి లీడర్లు. సిట్టింగ్ ఎమ్మెల్యే.. లోకల్‌లో తమ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందని చెబుతుంటే.. వైసీపీ కంచుకోటను బద్దలు కొడతానని.. మరో నేత కాళ్లకు బలపం కూడా కట్టుకోకుండా తిరుగుతున్నారు. ఎందుకో.. చూద్దాం..

ప్రకాశం జిల్లా గిద్దలూరు.. వైసీపీకి కంచుకోట. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత.. ఇక్కడ మరో పార్టీ గెలిచిన చరిత్ర లేదు. ఎందుకంటే.. ఎవరూ రాయలేదు. కానీ.. వచ్చే ఎన్నికల్లో.. అధికార పార్టీకి గిద్దలూరు సవాల్‌గా మారే పరిస్థితులు ఏర్పడ్డాయనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో వైసీపీకి ఉన్న అనుకూల పరిస్థితులన్నీ ఇప్పుడు లేవని.. సిట్టింగ్ ఎమ్మెల్యేపైనా అసంతృప్తి నెలకొందనే కారణాలు చూపుతున్నారు.

Also read : AP Politics : రాజమండ్రి వైసీపీలో ఊహించని పరిణామం..ఒక్కటైపోయిన ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజా వర్గాలు

గిద్దలూరు వైసీపీలో 3, 4 వర్గాలు తయారయ్యాయ్. దీనికి తోడు.. గతంలో లాగా అధికారాలన్నీ ఎమ్మెల్యే చేతిలో లేకపోవడం, కింది స్థాయి నాయకులకు.. చిన్నా, చితక కాంట్రాక్టులు అప్పగించే పవర్ లేకపోవడం.. కేడర్‌లో వ్యతిరేకత తలెత్తే పరిస్థితి తెచ్చిందనే.. చర్చ జరుగుతోంది. దీంతో.. ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పదని.. అనుచరులు, పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. వీటికి తోడు.. గిద్దలూరు నియోజకవర్గంలో అధిక ప్రాబల్యం ఉండే రెడ్డి సామాజికవర్గం.. ఎమ్మెల్యే రాంబాబుకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటం, వచ్చే ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం నాయకుడికే టికెట్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండటం.. చర్చనీయాంశంగా మారింది.

ఇక.. గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసిన.. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలో ఉన్నారు. గ్రామాగ్రామాన ఉండే ప్రజలను కలుస్తూ.. తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకుంటూ.. కేడర్‌కు దగ్గరవుతున్నారు. దీంతో.. నియోజకవర్గంలో అశోక్ రెడ్డి తీరుపై ఓ పాజిటివ్ టాక్ మొదలైందనే చర్చ వినిపిస్తోంది. ఇదే సమయంలో.. ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలన్నీ.. అశోక్ రెడ్డి పక్కన ఒక్కొక్కటిగా చేరిపోతున్నాయట. దీంతో.. వచ్చే ఎన్నికల్లో.. వైసీపీ గెలుపు అంత ఈజీ కాదని.. స్థానికులు చర్చించుకుంటున్నారు.

Also read : TS Politics : సైకిల్ దిగి కారెక్కి మూడేళ్లైనా దక్కని పదవి..మండవ వెంకటేశ్వరరావు రాజకీయ సన్యాసనం తీసుకోనున్నారా?
ఎమ్మెల్యే రాంబాబు కూడా.. గడప.. గడపకు వైసీపీ కార్యక్రమంతో.. ప్రజలకు దగ్గరవుతూ.. కేడర్‌ను సమన్వయం చేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను.. మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అవే. తనను మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి.. గిద్దలూరులో వైసీపీ జెండాను ఎగరేసి.. హ్యాట్రిక్ కొడతామని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. కానీ.. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయ్.. జనం మైండ్ సెట్ ఎలా ఉంటుందన్నదే.. గెలుపోటములను డిసైడ్ చేస్తాయ్. మరి.. ఎమ్మెల్యే ఆశలు నెరవేరతాయా? ప్రత్యర్థి.. ప్రయత్నాలు ఫలిస్తాయా అన్నది తెలియాలంటే.. ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే.