ISRO LVM-3 : అర్థరాత్రి నింగిలోకి దూసుకెళ్లటానికి బాహుబలి రాకెట్ LVM-3 కౌంట్ డౌన్ స్టార్ట్ .. కక్ష్యలోకి ఒకేసారి 36 ఉపగ్రహాలు

మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సన్నద్ధమైంది. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి అక్టోబర్ 23న బాహుబలి రాకెట్‌ జీఎస్‌ఎల్వీ-మార్క్‌ 3 (ఎల్వీ-ఎం3)ను ప్రయోగించనున్నది. దీనికి సంభందించిన కౌంట్‌‌డౌన్‌ శుక్రవారం అర్ధరాత్రి 12.07 గంటలకు ప్రారం‌భ‌మైంది. అర్ధరాత్రి 12.07 గంటలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రైవేట్‌ శాటి‌లైట్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ కంపెనీ వన్‌‌వె‌బ్‌కి చెందిన 36 బ్రాడ్‌‌బ్యాండ్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ శాటి‌లై‌ట్లను ఈ రాకెట్‌ ద్వారా రోద‌సి‌లోకి పంప‌నుంది.

ISRO LVM-3 : అర్థరాత్రి నింగిలోకి దూసుకెళ్లటానికి బాహుబలి రాకెట్ LVM-3 కౌంట్ డౌన్ స్టార్ట్ .. కక్ష్యలోకి ఒకేసారి 36 ఉపగ్రహాలు

ISRO ready to launch 36 OneWeb satellites on LVM-3 to space

ISRO LVM-3 : మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సన్నద్ధమైంది. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి అక్టోబర్ 23న బాహుబలి రాకెట్‌ జీఎస్‌ఎల్వీ-మార్క్‌ 3 (ఎల్వీ-ఎం3)ను ప్రయోగించనున్నది. దీనికి సంభందించిన కౌంట్‌‌డౌన్‌ శుక్రవారం అర్ధరాత్రి 12.07 గంటలకు ప్రారం‌భ‌మైంది. అన్నీ సజావుగా…ఎటువంటి ఆటంకం జరగకుండా ఉంటే..శనివారం (అక్టోబర్ 22,2022) అర్ధరాత్రి 12.07 గంటలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రైవేట్‌ శాటి‌లైట్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ కంపెనీ వన్‌‌వె‌బ్‌కి చెందిన 36 బ్రాడ్‌‌బ్యాండ్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ శాటి‌లై‌ట్లను ఈ రాకెట్‌ ద్వారా రోద‌సి‌లోకి పంప‌నుంది.

5,200 కిలోల బరువు కలిగిన ఈ 36 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నది. రాకెట్‌ భూమి నుంచి ఎగిరిన అనంతరం 16.21 నిమిషాల్లో 36 ఉపగ్రహాలను లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడుతుంది. ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన అనంతరం యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్‌ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు.