Breaking : శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై ఐటీ దాడులు

  • Published By: madhu ,Published On : March 4, 2020 / 06:54 AM IST
Breaking : శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై ఐటీ దాడులు

ఐటీ దాడుల ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు వస్తున్న ప్రజాప్రతినిధుల నివాసాలపై సోదాలు, తనిఖీలు చేసిన ఐటీ..అధికారులు..ఇప్పుడు విద్యా సంస్థలపై దృష్టి సారించారు. 2020, మార్చి 04వ తేదీ ఉదయం 5గంటలకు ప్రముఖ కళాశాలలుగా పేరొందిన శ్రీ చైతన్య, నారాయణ కళాశాలల సెంట్రల్ ఆఫీసులపై దాడులు నిర్వహించారు. తెలుగు రాష్టాల్లో ఉన్న వీరి కార్యాలయాలపై సోదాలు చేస్తున్నారు.

విజయవాడలో తెల్లవారుజామున ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించి..రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ల నివాసాలు, హైదరాబాద్ లో ఉన్న ప్రధాన కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఫీజుల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలకు సంబంధించిన న్యాయబద్ధంగా కట్టాల్సిన పన్ను ఎగవేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మొత్తం 8 టీంలు తనిఖీల్గొ పాల్గొంటున్నాయి. గత కొంతకాలంగా..నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో జరుగుతున్న అడ్మిషన్లు, వ్యాపార లావాదేవీల్లో వెల్లడించిన వివరాలు వేరేగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. దీంతో పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతే..ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. కంప్యూటర్స్ హార్డ్ డిస్క్, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

కళాశాలల యజమాన్యాలు వెల్లడించిన వివరాలు, సోదాల్లో లభించిన వివరాలను బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. నారాయణ, చైతన్య కళశాలలు దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. సంస్థల్లో చేరుతున్న విద్యార్థులు, ఆదాయానికి సంబంధించిన వాటిపై ఆరా తీస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన దానిపై అధికారులు దృష్టి సారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read More : లోక్ పాల్ రిజెక్ట్ చేస్తే..వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు