IT Raids : తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాల కలకలం.. రూ.800 కోట్ల అనధికార లావాదేవీలు

ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులుగా పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ సోదాలు జరిగాయి. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రూ.800 కోట్ల అనధికారిక లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించారు.

IT Raids : తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాల కలకలం.. రూ.800 కోట్ల అనధికార లావాదేవీలు

It Raids

IT Raids : ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులుగా పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ సోదాలు జరిగాయి. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రూ.800 కోట్ల అనధికారిక లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించారు. నవ్య డెవలపర్స్, రాఘ మయూరి ఇన్ ఫ్రా, స్కందాన్షీ ఇన్ ఫ్రా సంస్థల్లో సోదాలు జరిగాయి. ఈ కంపెనీల్లో ఒక కోటీ 64 లక్షల రూపాయల నగదుని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడుల విషయం తెలిసి అధికారులకు చిక్కకుండా సాఫ్ట్ వేర్ ను ధ్వంసం చేశారని తెలిపారు.

WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది.. మీ చాట్ బాక్సు ఫిల్టర్ చేసేస్తుంది..!

మూడు రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్ల కార్యాల‌యాల్లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ సోదాలు నిర్వ‌హించింది. ఈ సోదాలు జ‌న‌వరి 5 నుంచి మొదలయ్యాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప, నంద్యాల, బళ్లారి తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో చేతితో రాసిన పుస్తకాలు, అగ్రిమెంట్లు మొదలైన అనేక నేరారోపణ పత్రాల‌ను ఇన్‌క‌మ్ టాక్స్ అధికారులు గుర్తించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుంచి కూడా డిజిటల్ డేటా స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం. లెక్క‌ల‌ను తారుమారు చేసేలా.. ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్ ఉప‌యోగిస్తున్న‌ట్టు ఇన్‌క‌మ్ టాక్స్ అధికారులు కనుగొన్నారు.

ICICI Credit Card : క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన ఛార్జీలు