Thota Chandrasekhar: ఏపీలో జగన్, బాబు కుల రాజకీయాలు చేస్తున్నారు: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్

ఏపీని విడగొట్టిన కేసీఆర్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారని నన్ను అడుగుతున్నారు. ఏపీ రాష్ట్రాన్ని విడగొట్టింది కేసీఆర్ కాదు. ఏపీని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఏపీని విడగొడితే బీజేపీ సహకరించింది. వైసీపీ, టీడీపీ దీనికి అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని కడుపు మండి కేసీఆర్ తెలంగాణ కోసం గొంతెత్తారు. 

Thota Chandrasekhar: ఏపీలో జగన్, బాబు కుల రాజకీయాలు చేస్తున్నారు: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్

Thota Chandrasekhar: ఆంధ్రప్రదేశ్‌లో జగన్, చంద్రబాబు కులపిచ్చి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీని విడగొట్టిన కేసీఆర్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారని నన్ను అడుగుతున్నారు. ఏపీ రాష్ట్రాన్ని విడగొట్టింది కేసీఆర్ కాదు.

TSPSC Paper Leak: పది లక్షలు ఇచ్చేంత ఆర్థిక స్థోమత లేదు.. టీఎస్‌పీఎస్‌సీ నిందితుల తల్లిదండ్రులు

ఏపీని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఏపీని విడగొడితే బీజేపీ సహకరించింది. వైసీపీ, టీడీపీ దీనికి అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని కడుపు మండి కేసీఆర్ తెలంగాణ కోసం గొంతెత్తారు. ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. పోరాటం చేశారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది. 9ఏళ్ల క్రితం తెలంగాణలో కనీసం త్రాగునీరు లేదు. ఇప్పుడు కరువు రహిత రాష్ట్రంగా మారింది. కేసీఆర్ ఏపీ ప్రజలను తిట్టారని ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌‌లో ఎవరినైనా ఏమైనా అన్నారా? తెలంగాణ ప్రజలు.. ఏపీ ప్రజలు అని ఎప్పుడూ తేడా చూపలేదు.

Dasoju Sravan: బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్.. దాసోజు శ్రవణ్ ఆరోపణ

హైదరాబాద్‌లో ఏపీ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారు. తెలంగాణలాంటి అభివృద్ధి ఏపీలో జరగాలంటే బీఆర్ఎస్‌కు ఓటెయ్యాలి. ఏపీలో కుల పిచ్చి రాజకీయాలు బాబు, జగన్ చేస్తున్నారు. ఏపీ అభివృద్ధిపై ఇద్దరికీ చిత్తశుద్ధి లేదు. ఇద్దరు సీఎంల చేతకాని తనంవల్లే ఏపీలో అభివృద్ధి జరగలేదు. సముద్ర తీరం ఉన్నా ఏపీ అభివృద్ధికి నోచుకోలేదు’’ అని తోట చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ‘‘కేంద్రాన్ని ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయి. ఏపీలో వింత దుస్థితి దాపురించింది. ఇద్దరు నేతలు ఎన్డీఏలోనే ఉంటున్నారు.

జగన్, బాబు.. ఇద్దరూ మోదీ చెంతనే ఉన్నారు. ఇద్దరు కేంద్రాన్ని ఏమి అడిగే పరిస్థితి లేదు. ఏపీకి కేసీఆర్‌లాంటి నేత అవసరం. మోదీ అవినీతి, నియంతృత్వ పాలన అంతమొందిస్తాం. మోదీని ఎదురించే దైర్యం కేసీఆర్‌కే ఉంది. మోదీని ఎదిరిస్తే కవితను అరెస్టు చేసే యత్నం జరుగుతోంది. మేము భయపడం. తెలంగాణ పథకాలు దేశంలో అందరికీ అందాలి’’ అన్నారు.