HBDYSJagan: తనదైన మార్క్ పాలనతో.. ప్రజల మన్ననలు పొందుతున్న జగన్.. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోబోతున్నారు..
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి తనదైన మార్క్ పాలనతో ఏపీ ప్రజలచే మన్ననలు పొందుతున్నారు. రాజన్న బిడ్డగా, తమ మధ్య మనిషిగా పాదయాత్రతో ప్రజల్లో గడిపిన జగన్.. ప్రజల ఆశీర్వాదంతో అద్భుత విజయాన్ని సాధించారు. నాలుగేళ్ల వైసీపీ హయాంలో తనదైన మార్క్ పాలనతో ప్రజలకు జగన్ మరింత చేరువయ్యారు.

HBDYSJagan: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి తనదైన మార్క్ పాలనతో ఏపీ ప్రజలచే మన్ననలు పొందుతున్నారు. రాజన్న బిడ్డగా, తమ మధ్య మనిషిగా పాదయాత్రతో ప్రజల్లో గడిపిన జగన్.. ప్రజల ఆశీర్వాదంతో అద్భుత విజయాన్ని సాధించారు. నాలుగేళ్ల వైసీపీ హయాంలో తనదైన మార్క్ పాలనతో ప్రజలకు జగన్ మరింత చేరువయ్యారు. ప్రతీ గడపకు సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తూ, పేద ప్రజల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

AP CM YS Jagan
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 50వ పుట్టిన రోజు వేడుకలను ఏపీ వ్యాప్తంగా ప్రజలు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాడవాడలా జన్మదిన కేక్ కట్ చేసి జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ మండల, పట్టణ కేంద్రాల్లో వైసీపీ నేతలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

AP CM YS Jagan
వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు జగన్ పడిన కష్టం అంతాఇంతాకాదు. ప్రజల మద్దతుతో అఖండ విజయాన్ని జగన్ సొంతం చేసుకున్నారు. ఓ పార్టీకి అధినేతగా, ఓ నాయకుడిగా.. జగన్ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర నుంచే పార్టీ మేనిఫెస్టో పుట్టుకొచ్చింది. ముఖ్యంగా నవరత్నాలే వైసీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టాయ్. సామాజిక పెన్షన్లు, అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యార్థుల పథకాలు, నాడు – నేడు పేరుతో విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం అన్ని పటిష్టంగా అమలయ్యేలా జగన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నభూతో న భవిష్యతి అన్నట్టుగా పాలన ఉండాలని ఆదర్శంగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు.

AP CM YS Jagan
ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వేరు.. అధికార పార్టీగా ఓసారి రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా ఉండడం వేరు. ఇప్పుడు జగన్‌కు రాజకీయంగా అసలైన సవాళ్లు ఎదురయ్యే చాన్స్ ఉంది. వైఎస్ సెంటిమెంట్‌కు తోడు ఒక్క చాన్స్ అంటూ జగన్ విన్నపానికి జనం జై కొట్టారు. అధికారం కట్టబెట్టారు. అయితే ఇప్పుడు సంక్షేమం జనాలకు ఏ స్థాయికి చేరిందన్న దాని మీదే వైసీపీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

AP CM Jagan
నిజానికి సంక్షేమమే గెలిపిస్తుందని జగన్ ధీమాగా ఉన్నారు. గడపగడపకు కార్యక్రమాన్ని అంత సీరియస్‌గా తీసుకున్నా. ఇప్పుడు గృహ సారథులను పరిచయం చేసినా, ఆయన ధీమా అదే ! ఈ ఒక్కసారి విజయం సాధిస్తే మరో 30 ఏళ్లు రాష్ట్రంలో అధికారం తమదే అనే జగన్ మాట.. ఆయన భవిష్యత్ వ్యూహాలకు అద్దంపడుతోంది.

AP CM YS Jagan
ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పావులు కదుపుతున్నాయి. ఆ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి గట్టి పోటీ ఎదురవడం ఖాయం. ఇది సవాల్‌తో కూడుకున్న వ్యవహారమే. మరి దాన్ని ఎదుర్కొనేందుకు జగన్ ఎలాంటి వ్యూహం సిద్ధం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
AP CM YS Jagan
చిన్న వయసులో ఓ పార్టీ ఏర్పాటు చేసి. దాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన జగన్‌కు ఇకపై రాజకీయంగా సరికొత్త అనుభవాలు ఎదురయ్యే చాన్స్ ఉంది. రాజకీయంగా సరికొత్త ప్రత్యర్థులు ఎదురయ్యే చాన్స్ ఉంది. కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. అలాంటి దిమాక్‌కు పట్టుదల తోడైతే అతను జగన్‌లా ఉంటారు అంటూ 2024 ఎన్నికల్లో విజయంపై వైసీపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.