Jagan Sticker : ఇంటింటికీ జగన్ స్టికర్.. వైసీపీ ప్రభుత్వం మరో సరికొత్త, కీలక కార్యక్రమం

ఏపీ ప్రభుత్వం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఇంటింటికి జగన్ స్టిక్కర్. ఈ నెల 11 నుంచి వైసీపీ ప్రభుత్వం ఏపీలోని ఇంటింటికి సీఎం జగన్ స్టిక్కర్ వేయనుంది. ప్రభుత్వ పథకాలు అందే ఇంటికి వైఎస్ జగన్ స్టిక్కర్ అంటించనున్నారు.

Jagan Sticker : ఏపీ ప్రభుత్వం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఇంటింటికి జగన్ స్టిక్కర్. ఈ నెల 11 నుంచి వైసీపీ ప్రభుత్వం ఏపీలోని ఇంటింటికి సీఎం జగన్ స్టిక్కర్ వేయనుంది. ప్రభుత్వ పథకాలు అందే ఇంటికి వైఎస్ జగన్ స్టిక్కర్ అంటించనున్నారు. మా నమ్మకం నువ్వే అనే ట్యాగ్ లైన్ తో స్టిక్కర్ ను ముద్రించనున్నారు. ఇంటి యజమాని అనుమతితోనే స్టిక్కర్ వేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. గృహ సారథులు, వాలంటీర్ల సమన్వయంతో లబ్దిదారుల ఇళ్లను గుర్తించనున్నారు.

Also Read..Andhra Pradesh Govt Debts : ఏపీ అప్పుల చిట్టాను మరోసారి బయటపెట్టిన కేంద్రం.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?!

వైసీపీ ప్రభుత్వం ఏపీలో మరొక కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 11 నుంచి ఇంటింటికి జగన్ స్టికర్ అతికించనున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్లు ముద్రించారు. ఆ స్టిక్కర్లను రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా గత మూడేళ్లుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్దిదారులు ఇళ్లను గుర్తించి వాటిని అంటించనున్నారు. ఆ ఇళ్లకు ఎన్ని సంక్షేమ పథకాలు అందాయి, వారు ఎంత మేరకు లబ్ది పొందారో వివరిస్తారు. అలాగే ఆ ఇంటికి జగన్ స్టిక్కర్ వేయబోతున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన స్టిక్కర్ ను లబ్దిదారుల ఇళ్లకు అతికించనున్నారు. ఈ నెల 11 నుంచి దీనికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

Also Read..CM Jagan: మార్చిలో విశాఖకు మారనున్న సీఎం జగన్.. అనువైన ఇండ్ల అన్వేషణలో నేతలు, అధికారులు

గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లు వీరంతా అనుసంధానం చేసుకుంటూ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లను గుర్తిస్తారు. వాటిని గుర్తించి స్టిక్కర్ అతికిస్తారు. 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు ఉంటారు. వారు ఆయా ఇళ్లకు వెళ్తారు. ఇంటి యజమాని అనుమతి తీసుకున్న తర్వాతే ఆ ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న స్టిక్కర్ ను అతికిస్తారు. దీనికి సంబంధించిన కార్యక్రమం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ప్రారంభమైంది. ఇప్పటికే గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు నియమాకం కూడా పూర్తైంది. వారికి సంబంధించిన ట్రైనింగ్ క్లాసులు కూడా నియోజకవర్గాల వారీగా జరుగుతున్నాయి.

Also Read..Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అప్పులపై పవన్ కల్యాణ్ ఫైర్.. సీఎం జగన్‌పై సెటైరికల్ ట్వీట్

గతంలోనూ ఇలానే స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించారు. 2019 ఎన్నికలకు ముందు కూడా రావాలి జగన్ కావాలి జగన్ అనే స్టిక్కర్ క్యాంపెయిన్ ను వైసీపీ నిర్వహించింది. అప్పట్లో ఆ స్లోగన్ అనేది చాలా వైరల్ అయ్యింది. వైసీపీకి మంచి హైప్ వచ్చింది. అలానే ఇప్పుడు కూడా స్టిక్కర్లు అతికించే కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే, ఈసారి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లకు మాత్రమే స్టిక్కర్లను అతికించనున్నారు. ఇంటి యజమాని పర్మిషన్ తీసుకున్నాకే స్టిక్కర్లు అతికించనున్నారు. దీనికి సంబంధించి జాబితా ఇప్పటికే పూర్తైంది. ప్రతి గ్రామంలో సచివాలయ కన్వీనర్లు దీన్ని పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ఈ స్టిక్కర్లు నియోజకవర్గాలకు చేరుకున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు