సత్తెనపల్లిలో ఉద్రిక్తత..స్వతంత్ర అభ్యర్థిని భర్తపై జనసేన కార్యకర్తల దాడి

గుంటూరు జిల్లా సత్తెనపల్లి 7వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి భర్త నాగేశ్వరరావుపై జనసేన కార్యకర్తలు దాడికి యత్నించారు.

సత్తెనపల్లిలో ఉద్రిక్తత..స్వతంత్ర అభ్యర్థిని భర్తపై జనసేన కార్యకర్తల దాడి

attack on independent candidate’s husband : ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి 7వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి భర్త నాగేశ్వరరావుపై జనసేన కార్యకర్తలు దాడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

అటు తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. 15వ వార్డు మహాత్మాగాంధీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వైసీపీ నేతలను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడంపై టీడీపీ మహిళా నేతలు అభ్యంతరం తెలిపారు. ఆందోళనకు దిగారు. వైసీపీ, టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు అయింది. ఏలూరులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్ కు వెళ్లిన ఆళ్లనానికి అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏలూరు శనివారపుపేట ఇందిరాకాలనీలో తనకు ఓటు ఉండటంలో అదే కాలనీ స్కూల్లో ఆళ్ల నాని ఓటు వేసేందుకు వెళ్లారు. తన ఓటు గల్లంతు కావడంతో ఆయన అసహనానికి గురయ్యారు. డిప్యూటీ సీఎం ఓటే గల్లంతు కావడంతో అధికారులపై తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.