బిగ్ బ్రేకింగ్ : బీజేపీతో జనసేన పొత్తు..?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి బీజేపీ-జనసేన తెరతీసినట్టు తెలుస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నట్టు వార్తలు

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 09:40 AM IST
బిగ్ బ్రేకింగ్ : బీజేపీతో జనసేన పొత్తు..?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి బీజేపీ-జనసేన తెరతీసినట్టు తెలుస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నట్టు వార్తలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి బీజేపీ-జనసేన తెరతీసినట్టు తెలుస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ ఢిల్లీ పర్యటనలో పొత్తు కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బయటి నుంచి బీజేపీకి మద్దతిచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో పవన్ తన స్టాండ్ మార్చుకున్నారని సమాచారం.

బీజేపీతో కలిసి పని చేయాలని పవన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్.. సోమవారం(జనవరి 13,2020) బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రెండు పార్టీలు కలిసి పని చేయడంతో పాటు భవిష్యత్ కార్యచరణపై ఇరువురూ చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది. ఈ భేటీలో రాజధాని రగడ గురించి నడ్డాకు పవన్ వివరించారట.

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో పవన్ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తు కుదిరినట్టు వార్తలు వస్తున్నా.. ఇరు పార్టీల నుంచి అధికారిక ప్రకటన వచ్చాకే క్లారిటీ వస్తుంది. ఏపీలో రాజకీయ పరిస్థితులు హాట్ హాట్ గా ఉన్నాయి. రాజధాని మార్పు అంశం దుమారం రేపుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. అమరావతి రైతుల పోరాటం విషయంలో బీజేపీ కలిసి రావాలని పవన్ కోరినట్టు తెలుస్తోంది. బీజేపీతో కలిసి పని చేసేందుకు జనసేన సిద్ధంగా ఉందని పవన్ చెప్పినట్టు సమాచారం. జనసేనాని పవన్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ఆర్ఎస్ఎస్ నేతలతో పాటు బీజేపీ పెద్దలను కలిశారు. 

* ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం
* బీజేపీతో జనసేన పొత్తు..?
* జేపీ నడ్డాతో చర్చల్లో బీజేపీతో పొత్తుపై పవన్ అంగీకారం
* ఏపీలో ప్రజా సమస్యలపై కలిసి పోరాడాలని బీజేపీ, జనసేన నిర్ణయం
* రాజధాని రగడ గురించి పవన్ వివరణ
* భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసే అవకాశం

జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో పవన్ తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు. ఈయన ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి. బెంగళూరు ఎంపీ, ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ తేజస్వి సూర్యతో పవన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సంతోష్, తేజస్వి సూర్య ద్వారా జేపీ నడ్డా అపాయింట్ మెంట్ పవన్ తీసుకున్నట్టు సమాచారం.

Also Read : ఏం జరుగుతోంది : ప్రగతి భవన్ లో కేసీఆర్, జగన్ ఏకాంత భేటీ