రైతుల్ని బెదిరిస్తే ఊరుకోం : వాళ్లు మీలా జైలుకు వెళ్లివచ్చినవారు కాదు..సూట్ కేసుల కంపెనీవారు కాదు  

  • Edited By: veegamteam , December 31, 2019 / 11:29 AM IST
రైతుల్ని బెదిరిస్తే ఊరుకోం : వాళ్లు మీలా జైలుకు వెళ్లివచ్చినవారు కాదు..సూట్ కేసుల కంపెనీవారు కాదు  

రాజకీయ నాయకులు పదవుల్లో ఈరోజు ఉంటే రేపు ఉండరు..అటువంటి వారు ఇచ్చిన ఆర్డర్ లతో పోలీసులు రైతుల ఇళ్లల్లోకి వెళ్లివాళ్లను నానా కష్టాలపాలు చేయటం సరికాదని పవన్ కళ్యాణ్ పోలీసులకు సూచించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు జైలుకు వెళ్లివచ్చినవారు కాదు..సూట్ కేసుల కంపెనీవారు కాదు ..కష్టాన్ని నమ్ముకున్నవారు రైతులు..మట్టిని సాగుచేసి బంగారాన్ని పండిచేవారు రైతులు అటువంటి రైతుల్ని కష్టాలు పాలు చేసే ప్రభుత్వం మనుగడ సాగించదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. 

జగన్ రెడ్డిగారికి ప్రజలు  అధికారం  ఇచ్చింది నాలుగు గోడల మధ్యా ఉండే ఆడబిడ్డలను నడిరోడ్డుమీద కూర్చోబెడతారని కాదని ప్రజల్ని సంతోషంగా ఇవ్వటానికి అధికారం ఇస్తే రైతుల కళ్లనుంచి రక్తాన్ని చిందిస్తున్నారని విమర్శించారు. ఒక్కఛాన్స్ ఇవ్వమని అడిగిన జగన్ రెడ్డిగారికి 151 సీట్లు ఇచ్చి అధికారం ఇస్తే ఇలా జరిగింది..మరోసారి అధికారం ఇస్తారో లేదో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు.

అధికారం ఇచ్చిన పెద్ద కొడుకు జగన్ ను అక్కడ నుంచి గెంటేసే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు పవన్. రైతులను బెదిరించి అవమానించాలని చూస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వానికి పవన్ హెచ్చరించారు.  జగన్ రెడ్డి అడిగినట్లుగానే ప్రజలు పెద్ద కొడుకు పదవిని ఇస్తే ఆ పెద్దకొడుకు ఇప్పుడు బిడ్డల్లాంటి ప్రజలకు గెంటేయటానికి చూస్తున్నాడని అన్నారు పవన్. 

టీడీపీ అధికారంలోకి ఉన్న సమయంలో రాజధాని కోసం భూ సమీకరణ సమయంలో మూడు పంటలు పండిచే 33వేల ఎకరాల భూముల్ని సేకరిస్తుంటే తాను భయపడ్డాననీ..ఆ సమయంలో రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేయవద్దని ఆనాటి సీఎం చంద్రబాబుకు సూచించాననీ పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు కష్టం వస్తే ఆరోజున టీడీపీని నిలదీశాను. ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నానని రాజధాని రైతులకు ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు రైతులకు భరోసా ఇచ్చారు.  

ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేశాలు సృష్టిస్తోందనీ..టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని సమస్యలు వైసీపీకి గుర్తు రాలేదా అనిప్రశ్నించారు. అలాగే టీడీపీ రాజధాని రైతుల విషయంలో పోరాటాన్ని కొనసాగించాలనీ గతంలోలాగా రెండు కళ్ల సిద్దాంతం అంటూ చంద్రబాబు ఎస్కేప్ అవ్వకూడదనీ..రైతుల నుంచి భూ సేకరణ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ రైతులకు కష్టం వస్తే నిలబడాలనీ..పోరాడాలని పవన్ సూచించారు.