AP municipal Election 2021 : బెదిరింపుల వల్లే వైసీపీ గెలిచిందన్న పవన్

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ స్పందించారు. బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని ఆరోపించారు.

AP municipal Election 2021 : బెదిరింపుల వల్లే వైసీపీ గెలిచిందన్న పవన్

Pawan Kalyan

Janasena Chief Pawan Kalyan : మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ స్పందించారు. బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని ఆరోపించారు. ప్రజల కడుపుమీద కొట్టి, తిండి లాక్కుంటామని బెదిరించి ఓట్లు సాధించింధించని విమర్శించారు. ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారన్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, విద్యా పథకాలు ఆపేస్తామని భయపెట్టి ఓట్లేయించుకున్నారన్నారు పవన్ కల్యాణ్. గత 20 ఏళ్ల పాలనపై భరోసా మీద ఓట్లు వేయలేదన్నారు.

మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ క్వీన్ స్వీప్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఫ్యాన్ గాలి బలంగా వీచింది. వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 9 కార్పొరేషన్ లను కైవసం చేసుకుంది అధికార పార్టీ. 71 మున్సిపల్ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయదుందుభి మ్రోగించారు. రెండు మున్సిపల్ ప్రాంతాల్లో మాత్రమే టీడీపీ అధిక్యత కనబరిచింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించిన విశాఖ కార్పొరేషన్ ను సైతం వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 98 డివిజన్లు ఉన్న గ్రేటర్ విశాఖలో అధికార వైసీపీ 55 స్థానాలు, టీడీపీ 29, జనసేన 4, సీపీఎం, సీపీఐ, బీజేపీ, ఇండిపెండెంట్ ఒక్కో స్థానాల్లో గెలుపొందారు. తాడిపత్రిలో ఎక్స్ అఫిషియో ఓట్లతో వైసీపీ గెలుచుకొనే ఛాన్స్ లున్నాయి. మొత్తంగా..మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. 23 నెలల పాలనలో వైసీపీ అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఫిదా అయ్యారు.