Home » Andhrapradesh » అప్పుడిలా..ఇప్పుడిలా : గ్లాస్‌లో పువ్వు..కామ్రేడ్లకు పవన్ షాక్
Publish Date - 12:57 am, Fri, 17 January 20
By
madhuగత ఎన్నికల్లో ఎర్ర కండువా మెడలో వేసుకుని ప్రచారం చేసిన పవన్.. ఇక నుంచి కాషాయ కండువాతో ముందుకెళ్తానంటున్నారు. పోరాటం అంటే కమ్యూనిస్టులదేనని ఆనాడు పొగిడిన సేనాపతి.. ఇప్పుడు మాత్రం ముందు నుంచీ తాను కాషాయవాదినేనని చెప్పి షాక్ ఇచ్చారు. దీంతో పవన్ తీరును ఎండగట్టే పనినే ఓ పోరాటంగా తీసుకుంటామన్నాయి వామపక్షాలు.
* వామపక్షాలకు పవన్ ఝలక్
* ప్రత్యేక హోదాపై మాటమార్చిన పవన్
* వామపక్షాల కంటే ముందు బీజెపీతోనే మైత్రి అని సమర్థన
* వామపక్షాలకు బాకీ పడ్డానా అని ప్రశ్న
మాట తప్పం.. మడమ తిప్పం అనే డైలాగు జనసేనాని కూడా కొట్టాడు. కానీ, ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదాపై మాట మార్చారు. హోదా కోసం తాను చేయాల్సింది చేశానని తెగేసి చెప్పారు. పాచిపోయిన లడ్డూలు ఎందుకని కేంద్రాన్ని ఓ రేంజ్‌లో ఏకేసిన పవన్.. కాషాయజెండా నీడలోకి వెళ్లగానే స్వరం మార్చారు. మొన్నటి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన పవన్.. ఇప్పుడు బీజేపీతో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. తన గ్లాస్‌లో పువ్వు పెట్టి కామ్రేడ్లకు గట్టి ఝలక్ ఇచ్చారు పవన్.
హోదాపై వైఖరి ఏంటని గట్టిగా అడిగితే.. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్యాకేజీ అంగీకరించడం వల్లే ఇప్పుడీ సమస్య వచ్చిందని పవన్ కామెంట్ చేశారు. మరి వామపక్షాల సంగతేంటి అడిగితే.. కమ్యూనిస్టులకు తానేమైనా బాకీ ఉన్నానా అంటూ ఎదురు సమాధానం ఇచ్చారు. ఆమాటకొస్తే.. వామపక్ష పార్టీలతో కలవక ముందే బీజేపీ కోసం పని చేశానని గుర్తు చేశారు.
ఏడు నెలల ముందు వరకు కమ్యూనిస్టులతో రాసుకుతిరిగిన సంగతి తెలిసిందే. బెంజిసర్కిల్ దగ్గర నుంచి రామవరప్పాడు వరకు వామపక్షాలతో కలిసి నడిచారు. అంతెందుకు..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు చొక్కా చెమటకు తడిసిపోతే.. దాన్ని తీసుకొని తన భుజాన వేసుకొని మరీ నడిచారు పవన్. పవనిజం, కమ్యూనిజం రాష్ర్టానికి అవసరం అనేంతగా కలిసిమెలిసి తిరిగారు. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నాక.. వామపక్షాలతో పవన్ అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇప్పుడు బీజేపీతో మైత్రి కుదుర్చుకుని.. వామపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చారు పవన్.
పవన్ వైఖరిపై వామపక్ష నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. తాను వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తినే అంటూ చేగువేరా పేరును, జెండాను భుజానికి ఎత్తుకున్న పవన్‌ను.. తూర్పారబట్టే పనిలో ఉన్నాయి వామపక్షాలు.
Read More : రాజధాని తేల్చేస్తారా : జగన్‌తో హై పవర్ కమిటీ భేటీ
Tollywood : లేటెస్ట్ 30 ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్..
Vakeel Saab : ‘వకీల్ సాబ్’ ఘనవిజయం మా బాధ్యత మరింత పెంచింది – నిర్మాత దిల్ రాజు..
Jana sena Glass symbol: జనసేనకి ఊహించని ఎదరుదెబ్బ.. సింబల్ పోయింది
Tollywood: ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ టాలీవుడ్ 30 అప్డేట్స్..
Pawan Kalyan Corona : పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్
Pawan Kalyan : సీమ స్లాంగ్‌లో పవర్‌స్టార్ పవర్ఫుల్ డైలాగ్స్.. సాయమందిస్తున్న పెంచల్ దాస్..