పదవుల కోసం కాదు..ప్రజల కోసం : పవన్ దీక్ష విరమణ

  • Published By: madhu ,Published On : December 12, 2019 / 12:45 PM IST
పదవుల కోసం కాదు..ప్రజల కోసం : పవన్ దీక్ష విరమణ

ప్రజల కోసం పుట్టింది జనసేన. పదవుల కోసం కాదు..రైతుకు పట్టం కట్టేందుకు జనసేన ఉంది..పంటను పండించే రైతును ఎవరూ పట్టించుకోవడం లేదు..అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకినాడలో 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం రైతు సౌభాగ్య దీక్ష చేశారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా పవన్ ప్రసంగించారు.

రైతుల కష్టాలు తనకు తెలుసని, ఒక చిన్న మడిలో వ్యవసాయం  చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల కన్నీళ్లు ఆగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం వరకు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండదని అనుకున్నాని అన్నారు.

కానీ కొన్ని నెలల్లోనే రోడ్లపై రావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సూట్ కేసు కంపెనీలు తాను పెట్టలేదు..కాంట్రాక్టులు చేయను..సినిమాలు మాత్రమే చేశానన్నారు పవన్. ఓడిపోయిన అనంతరం ఆత్మస్థైర్యం సాధారణంగా దెబ్బతింటుంది..తనకు మాత్రం అలా కాలేదన్నారు. అధికారం కోసం తాను ఆలోచించలేదని మరోమారు స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. 
Read More : ప్రభుత్వానికి పొగరు : మీడియాకు సంకెళ్లు..ఖండిస్తున్నాం – బాబు