Janasena Vs AP Women Commission : మహిళా కమిషన్‌పై జనసేన ట్వీట్ అటాక్.. 18 ప్రశ్నలతో ఎదురు దాడి

ఏపీ మహిళా కమిషన్ పై జనసేన ట్వీట్ ఫైట్ ప్రకటించింది. ఏపీ మహిళా కమిషన్ కు 18 ప్రశ్నలు సంధిస్తూ వరుస ట్వీట్ లు చేసింది.

Janasena Vs AP Women Commission : మహిళా కమిషన్‌పై జనసేన ట్వీట్ అటాక్.. 18 ప్రశ్నలతో ఎదురు దాడి

Janasena Vs AP Women Commission : ఏపీ మహిళా కమిషన్ పై జనసేన ట్వీట్ ఫైట్ ప్రకటించింది. ఏపీ మహిళా కమిషన్ కు 18 ప్రశ్నలు సంధిస్తూ వరుస ట్వీట్ లు చేసింది. ఏపీ ఉమెన్ కమిషన్ ఎక్స్ పోజ్డ్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తెచ్చింది. ప్రస్తుతం ఏపీ ఉమెన్ కమిషన్ ఎక్స్ పోజ్డ్.. ట్రెండింగ్ ట్వీట్స్ లో రెండో స్థానంలో కొనసాగుతోంది.

 

ఏపీలో మహిళలపై దాడులు జరిగినప్పుడు ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? అంటూ జనసేన ట్వీట్ చేసింది. వైసీపీ మంత్రులు మహిళలను కించపరిచినప్పుడు ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగినప్పుడు ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? అంటూ ప్రశ్నలు సంధించింది. పవన్ కల్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే జనసేన ట్వీట్ ఫైట్ కు దిగడం ఆసక్తి రేపుతోంది.

కాగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మూడు పెళ్లిళ్లకు సంబంధించి పవన్ వ్యాఖ్యలపై కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కింది. ఈమే రకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

భార్యకు విడాకులతో పాటు భరణం ఇచ్చి ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చని పవన్ అనడం తనను బాధించిందని పద్మ చెప్పారు. భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఎలా? అని ప్రశ్నించారు. స్టెప్నీ అంటూ మహిళలను సంబోధించడంపైనా వాసిరెడ్డి పద్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తన పెళ్లిళ్ల విషయంలో పదేపదే విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై పవన్ విరుచుకుపడ్డారు. తాను విడాకులు ఇచ్చి, భరణం ఇచ్చాకే మరో పెళ్లి చేసుకున్నానని పవన్ వివరించారు. చేతనైతే మీరు కూడా భరణమిచ్చి మరో పెళ్లి చేసుకోండని చెప్పారు. ఒక్క పెళ్లి చేసుకుని 30మంది స్టెప్నీలతో తిరుగుతారని వైసీపీ నేతలపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ పవన్ కల్యాణ్ కు నోటీసులిచ్చింది.