JC prabhakar reddy.. ED : ‘ఈడీయే నా దేవుడు’ ఆస్తులు ఎటాచ్ చేయటంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

వాహనాల కుంభకోణం కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆస్తులు ఎటాచ్ చేయటంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులపై ఈడీ విచారణ చేపట్టటం సంతోషంగా ఉంది..ఈడీ రూపంలోనే నాకు దేవుడు ఉన్నాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

JC prabhakar reddy.. ED : ‘ఈడీయే నా దేవుడు’ ఆస్తులు ఎటాచ్ చేయటంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

JC prabhakar reddy.. ED : వాహనాల కుంభకోణం కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ బిగ్ షాకిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆయన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. ఇద్దరివీ కలిపి 22.10 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. ఈక్రమంలో ఆస్తులు ఎటాచ్ చేయటంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులపై ఈడీ విచారణ చేపట్టటం సంతోషంగా ఉంది..ఈడీ రూపంలోనే నాకు దేవుడు ఉన్నాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాకు వాహనాలు అమ్మిన అశోక్ లేలాండ్, నాగాలాండ్ అధికారులను మాత్రం ఈడీ ఇంకా విచారించలేదని తెలిపారు. రూ.38 కోట్ల స్కామ్ చేశానని అంటున్నారు..కానీ వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. ఈడీ కేసులో ఆర్టీవో,పోలీసు అధికారుల కూడా ఇరుక్కోవటం తప్పదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అశోక్ లేలాండ్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నిచాలని ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాగా..వాహనాల కుంభకోణం కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డికి..ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఇద్దరివీ కలిపి 22.10 కోట్ల ఆస్తులు అటాచ్ చేసినట్టు సమాచారం. కాగా BS-4 వాహనాల రిజిస్ట్రేషన్ లో అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తుంది.

JC prabhakar reddy.. ED : జేసీ ప్రభాకర్‌రెడ్డికి షాక్ .. రూ.22 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

2017 ఏప్రిల్ 1 తర్వాత బీఎస్ 3 వాహనాల అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. అనేక చట్టాలను ఉల్లంఘించి కొన్ని వాహనాలను విక్రయించారనే ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే స్క్రాప్‌ వాహనాల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్‌, చట్టాలను ఉల్లంఘించి విక్రయించడంపై ఈడీ అధికారులు ప్రభాకర్ రెడ్డిని గత నెలలో ప్రశ్నించారు. ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు.

ఈ కేసు విషయానికి వస్తే.. ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బీఎస్ 3 ప్రమాణాలు కలిగిన వాహనాలను అక్రమంగా బీఎస్ 4 వాహనాలుగా మార్చుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. ప్రభాకర్ రెడ్డి కంపెనీలకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతుంది.