JEE Advanced 2020‌ పరీక్ష..విద్యార్థులకు సూచనలు

  • Published By: madhu ,Published On : September 27, 2020 / 07:21 AM IST
JEE Advanced 2020‌ పరీక్ష..విద్యార్థులకు సూచనలు

JEE Advanced exam : కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పరీక్షలు ఒక్కొక్కటిగా నిర్వహస్తున్నారు అధికారులు. 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష జరుగనుంది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఏపీలో 30 చోట్ల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.



పేపర్‌–1 ఉదయం 9 గంటల నుంచి, పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఇక ప్రతి ఎగ్జామ్స్ కు విధంచే ఒక్క నిమిషం నిబంధన ఈ పరీక్షకు వర్తింప చేయనున్నారు.



దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 2.50 లక్షల మంది అర్హత సాధించినా 1.60 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఉదయం 7 గంటలకల్లా అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో రిపోర్ట్‌ చేయాలి.



విద్యార్థులకు సూచనలు : –
షూస్‌ ధరించకుండా..సాధారణ చెప్పులు వేసుకోవాలి.
కోవిడ్‌–19 సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారం కూడా సమర్పించాలి.
మాస్కు ధరించడంతోపాటు శానిటైజర్, వాటర్‌ బాటిళ్లు తెచ్చుకోవాలి.
ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. కేటాయించిన సీట్ల వద్ద



కంప్యూటర్‌ స్క్రీన్‌పై అభ్యర్థి పేరు, ఫొటో, జేఈఈ రోల్‌ నంబర్‌ కనిపిస్తాయి.
అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతో పాటు ఇతర అధికారిక గుర్తింపుకార్డు తీసుకురావాలి.
గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక పరీక్ష సమయానికి అరగంట ముందు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు.
రోల్‌ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్‌ కావచ్చు.