Ap new cabinet: పేదవాడి సొంతింటి కలను జగన్ నిజం చేస్తారు.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోగి రమేష్

పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నిజం చేస్తారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్ లో ...

Ap new cabinet: పేదవాడి సొంతింటి కలను జగన్ నిజం చేస్తారు.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోగి రమేష్

Jogi Ramesh

Ap new cabinet : పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నిజం చేస్తారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్ లో ప్రత్యేక పూజల నిర్వహించి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ బధ్యతలు స్వీకరించారు. అనంతరం విశాఖపట్టణంలో అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం జగన్ అధిక గుర్తింపు ఇచ్చారని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. 31లక్షల మందికి ఇళ్లు కట్టే శాఖకు సీఎం జగన్ నన్ను మంత్రిగా చేయడం ఆనందంగా ఉందని అన్నారు.

AP New Cabinet : ఏపీ నూతన మంత్రివర్గం.. ప్రమాణం చేసిన మంత్రులు వీరే…

పేదవాడి సొంతింటి కలను జగన్మోహన్ రెడ్డి నిజం చేస్తున్నారని అన్నారు. విశాఖలోని లక్ష మంది పేదలకు ఇల్లు కట్టిస్తామని అన్నారు. గతంలో ఇంటి నిర్మాణానికి 90 సిమెంట్ బ్యాగ్‌లు ఇచ్చేవాళ్లమని, ఇప్పుడు 140 సిమెంట్ బస్తాలు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని అన్నారు. పాదయాత్రలో ప్రతి గ్రామంలో జగనన్నకు పేద ప్రజలు తమ కష్టాలను విన్నవించుకున్నారని, ఆ కష్టాలను చూసి అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. పేదలకు సేచురేషన్ పద్దతిలో ఇళ్లు కట్టిస్తున్నామని జోగి రమేష్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ అధిక గుర్తింపు ఇచ్చారని అన్నారు. తనకు అడుగడుగునా అండగా నిలిచిన జిల్లా శాసన సభ్యులు,  నియోజక వర్గ ప్రజలకు మంత్రి జోగి రమేష్ ధన్యవాదాలు తెలియజేశారు.