Andhra Pradesh: కరోనా..24 గంటల్లో 4 వేల 549 కేసులు

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 4 వేల 549 మందికి కరోనా సోకింది. 59 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Andhra Pradesh: కరోనా..24 గంటల్లో 4 వేల 549 కేసులు

Andhra Pradesh (2)

Andhra Pradesh: ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 4 వేల 549 మందికి కరోనా సోకింది. 59 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

80 వేల 013 యాక్టివ్ కేసులు ఉండగా..11 వేల 999 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 860 కరోనా కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 18,14,393 పాజిటివ్ కేసులకు గాను 17,22,381 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 80 వేల 013 గా ఉంది.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారు :-

చిత్తూరులో పన్నెండు మంది, ప్రకాశం తొమ్మిది, పశ్చిమ గోదావరి ఆరుగురు, కృష్ణా ఐదుగురు, అనంతపూరంలో నలుగురు, తూర్పు గోదావరి నలుగురు, శ్రీకాకుళం నలుగురు, గుంటూరు ముగ్గురు, కర్నూలు ముగ్గురు, విశాఖపట్నం ముగ్గురు, విజయనగరం ముగ్గురు, వైఎస్ఆర్ కడప ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు మృతి చెందారు.

జిల్లాల వారీగా కేసులు :-
అనంతపురం 272, చిత్తూరు 860, ఈస్ట్ గోదావరి 619, గుంటూరు 322, వైఎస్ఆర్ కడప 412, కృష్ణా 210, కర్నూలు 198, నెల్లూరు 182, ప్రకాశం 207, శ్రీకాకుళం 228, విశాఖపట్టణం 263, విజయనగరం 247, వెస్ట్ గోదావరి 529. మొత్తం : 4,549