Tarakaratna Health Condition: నిన్నటితో పోలిస్తే తారకరత్న ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు.. జూ. ఎన్టీఆర్

తారకరత్న ఆరోగ్యంపై జూ. ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మబలం, అభిమానుల ఆశీర్వాదం అతడికి ఉందని అన్నారు. ఆరోగ్య పరిస్థితి విషంగానే ఉన్నప్పటికీ వైద్యానికి సహకరిస్తున్నారని, నిన్నటి కంటే ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని వైద్యులు తెలిపారని ఎన్టీఆర్ చెప్పారు.

Tarakaratna Health Condition: నిన్నటితో పోలిస్తే తారకరత్న ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు.. జూ. ఎన్టీఆర్

Jr. NTR

Tarakaratna Health Condition: చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్నను చూసేందుకు నందమూరి కుటుంబ సభ్యులు తరలివస్తున్నారు. సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆస్పత్రి వద్దే ఉంటూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నారు. కాగా తారకరత్నను చూసేందుకు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు బెంగళూరు ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Taraka Ratna Health: తారకరత్న చికిత్సకు సహకరిస్తున్నాడు.. త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నా.. బాలకృష్ణ

తారకరత్న ఆరోగ్యంపై జూ. ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మబలం, అభిమానుల ఆశీర్వాదం అతడికి ఉందని అన్నారు. ఆరోగ్య పరిస్థితి విషంగానే ఉన్నప్పటికీ వైద్యానికి సహకరిస్తున్నారని, నిన్నటి కంటే ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని వైద్యులు తెలిపారని ఎన్టీఆర్ చెప్పారు. ఒక కుటుంబ సభ్యుడిగా వైద్యులు నాకు ధైర్యం చెప్పారు. తాతగారి ఆశీస్సులు, దేవుడి దీవెనలు ఆయనకు బలంగా ఉన్నాయి. అందరి ప్రార్థనలతో తారకరత్న త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని ఎన్టీఆర్ అన్నారు.

 

అంతకుముందు బాలకృష్ణ మాట్లాడుతూ.. తారకరత్న వైద్యానికి సహకరిస్తున్నాడని తెలిపారు. ఆరోగ్యం ప్రస్తుతంగా విషమంగానే ఉన్నప్పటికీ త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటాడనే నమ్మకముందని బాలకృష్ణ అన్నారు. ఇదిలాఉంటే తారకరత్నను చూసేందుకు బాలకృష్ణ సతీమణి వసుందర, లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి, ఎన్టీఆర్ సతీమణి ప్రణిత, నందమూరి కుటుంబ సభ్యులు, తదితరులు ఆస్పత్రి వద్దకు వచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు తారకరత్నను చూసేందుకు నందమూరి అభిమానులు, తెదేపా కార్యకర్తలు భారీగా తరలివస్తుండటంతో ఆస్పత్రి వద్ద కర్ణాటక పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు.