Baby Kidnapped : ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన బిడ్డ కిడ్నాప్

ఆసుపత్రిలో పొత్తిళ్లలో అమ్మ పక్కనే పడుకున్న చంటిబిడ్డను గుర్తు తెలియిన ఓ మహిళ ఎత్తుకుపోయింది.బిడ్డ కనిపించకపోవటంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న విషాదకర ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆదోనిలోని వంశీ చైతన్య నర్శింగ్ హోమ్ లోని అప్పుడే పుట్టిన శిశువును ఓమహిళల అపహరించుకుపోయిన ఘటన కలకలం రేపింది.

Baby Kidnapped : ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన బిడ్డ కిడ్నాప్

Baby Kidnapped In Hospital (1)

Baby Kidnapped In hospital : ఆసుప్రతుల్లో చంటిబిడ్డలను ఎత్తుకెళ్లిపోతున్న ఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఇటువంటి ఘటనలను బట్టి చూస్తుంటూ ఆసుపత్రుల్లో భద్రత..సెక్యూరిటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పొత్తిళ్లలో బిడ్డను పోగొట్టుకుని తల్లుల మనోవేదనలు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో మరోతల్లికి అటువంటి వేదన కలిగింది. ఆసుపత్రిలో పొత్తిళ్లలో అమ్మ పక్కనే పడుకున్న చంటిబిడ్డను గుర్తు తెలియిన ఓ మహిళ ఎత్తుకుపోయింది.బిడ్డ కనిపించకపోవటంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న విషాదకర ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆదోనిలోని వంశీ చైతన్య నర్శింగ్ హోమ్ లోని అప్పుడే పుట్టిన శిశువును ఓమహిళల అపహరించుకుపోయింది.

ప్రసవం అయ్యాక తల్లి ఒడిలో బిడ్డను పడుకోబెట్టిన సమయంలో ఓ మహిళ అక్కడకు వచ్చింది.బిడ్డకు ఇంజెక్షన్ చేయాలని డాక్టర్ గారు తీసుకురమ్మన్నారని చెప్పి బిడ్డనుతీసుకెళ్లింది. కానీ ఎంతకూ బిడ్డను తిరిగి తీసుకురాకపోవటంతో తల్లి కంగారు పడింది. ఆసుపత్రి సిబ్బందిని అడిగింది. ఇంజెక్షన్ చేయాలని బురఖా వేసుకుని వచ్చిన ఓ మహిళ అడిగి తీసుకెళ్లిందని తల్లి వాపోయింది. నా బిడ్డను నాకు ఇప్పించాలని కన్నీటితో వేడుకుంటోంది.

బిడ్డ కనిపించట్లేదని ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. తల్లి నుంచి వివరాలు సేకరించి ఆసుపత్రిలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. బురఖా వేసుకున్న మహిళ అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. అనంతరం శిశువు కిడ్నాప్ కేసును నమోదు చేసుకుని రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి శిశువు కోసం గాలింపు చేపట్టారు.