KA Paul : జగన్ ఏపీని అప్పుల కుప్పగా చేస్తే..షర్మిల తెలంగాణను ఉద్ధరిస్తుందట.. : కేఏ పాల్

జగన్ మోహన్ రెడ్డి ఏపీని అప్పుల కుప్పగా మార్చారు. ఆయనగారి చెల్లెలు షర్మిల తెలంగాణలో పార్టీని పెట్టి అక్కడ ఉద్దరిస్తారట అంటూ ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఎద్దేవా చేశారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పాల్ డిమాండ్ చేశారు.

KA Paul : జగన్ ఏపీని అప్పుల కుప్పగా చేస్తే..షర్మిల తెలంగాణను ఉద్ధరిస్తుందట.. : కేఏ పాల్

KA Pal Fire on AP CM Jagan.. Criticism (1)

KA Pal Fire on AP CM Jagan : జగన్ మోహన్ రెడ్డి ఏపీని అప్పుల కుప్పగా మార్చారు. ఆయనగారి చెల్లెలు షర్మిల తెలంగాణలో పార్టీని పెట్టి అక్కడ ఉద్దరిస్తారట అంటూ ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఎద్దేవా చేశారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పాల్ డిమాండ్ చేశారు.

జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు పాల్. అనాలోచిత నిర్ణయాలతో అందరిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని..దాంట్లో భాగంగానే ఏపీలోని టీచర్లకు అటెండెన్స్ అంటూ ఓ పిచ్చి నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో ఉపాధ్యాయులకు ‘ఫేస్ రికగ్నేషన్ యాప్’పై కేఏ పాల్ మండిపడ్డారు. ఇటువంటి నిబంధనలు టీచర్లకు పెట్టటం సరికాదన్నారు. ఇటువంటి విధానం ప్రజాప్రతినిధులకు కూడా పెట్టాలని మంత్రులు..ఎమ్మెల్యేలకు కూడా ఫేస్ రికగ్నేషన్ అమలు చేయాలి అంటూ తనదైన శైలిలో కేఏ పాల్ డిమాండ్ చేశారు.

Also read : Ap Teachers Attendance : ఏపీలో ప్రభుత్వ టీచర్ల అటెండెన్స్ కష్టాలు…టైమ్ కు వెళ్లినా..పనిచేయని నెట్ వర్క్ తో ఇబ్బందులు

కాగా..ఏపీలో ప్రభుత్వ టీచర్లకు ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి తీసుకు వచ్చింది. కానీ నెట్ వర్క్ ప్రాబ్లమ్ తో టీచర్లు నానా పాట్లు పడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా పలుప్రాంతాల్లో నెట్ వర్క్ ప్రాబ్లమ్ తో టీచర్లు అటెండెన్స్ కోసం తెచ్చిన ఏపీ సిమ్స్ యాప్ సరిగా పనిచేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అటెండెన్స్‌కు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆఫ్ డే లీవ్‌గా పరిగణిస్తామని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయటంతో పాపం ఉపాధ్యాయులకు ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. అటెండెన్స్ యాప్‌ను వినియోగిస్తుంటే.. క్యాప్చా ఎర్రర్ అని చూపిస్తుందని వాపోతున్నారు.

కొన్ని చోట్ల నెట్‌వర్క్ సమస్య.. సాంకేతిక సమస్యలు, డౌన్‌లోడ్, అప్‌లోడ్ సమస్యలు ఉన్నాయని వాపోతున్నారు. దీంతో ఈ యాప్ విధానంపై టీచర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దీన్ని తీసివేయాలను డిమాండ్ చేస్తున్నారు. ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.