KA Paul on AP: ఏపీలో జరిగింది చాలు.. నేనొస్తున్నా: కేఏ పాల్

తెలుగు రాష్ట్రాల రాజకీయాల తీరుపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఈ శనివారం ఉదయం హైదరాబాద్ లో.. ప్రముఖులంతా తన పార్టీలో చేరబోతున్నారని కామెంట్ చేశారు.

KA Paul on AP: ఏపీలో జరిగింది చాలు.. నేనొస్తున్నా: కేఏ పాల్

Ka Paul

తెలుగు రాష్ట్రాల రాజకీయాల తీరుపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఈ శనివారం ఉదయం హైదరాబాద్ లో.. ప్రముఖులంతా తన పార్టీలో చేరబోతున్నారని కామెంట్ చేశారు. ఏపీలో జరిగింది చాలని.. తాను వచ్చేస్తున్నానని.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంతా కలిసి నడుద్దామని అన్నారు. జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు దోపిడీకే సరిపోయాయని.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. యూత్.. నిరుద్యోగులు.. మహిళలు, అన్ని సామాజిక వర్గాలు.. ప్రజాశాంతి పార్టీతో కలిసి ఒక్కటి కావాలని అన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రేమించే వాళ్లు, అభివృద్ధి కోరుకునేవాళ్లు తనతో కలిసి నడవాలన్నారు. ఒకరు తిడతారు.. మరొకరు దాడులు చేస్తారు.. ఇదే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోందని కామెంట్ చేశారు. తెలంగాణలోనూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగడం లేదని చెప్పారు. ఇలాంటి రాజకీయాలకు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు.

అప్పులు చేసి అభివృద్ధి చేయడం.. తిరిగి అప్పులు తీర్చడం.. తనతో తప్ప మరెవరితో సాధ్యం కాదని.. ప్రజల కోసం రాత్రనక, పగలనక పని చేసేందుకు తాను సిద్ధపడ్డానని కేఏ పాల్ అన్నారు. త్వరలో తాను వచ్చేస్తున్నా.. అంటూ తెలుగు ప్రజలకు చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని.. ఇలాంటి సమయంలో.. ఫైటింగ్ లు, అరెస్టులు, తిట్లతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.