విశాఖ ఉక్కు కోసం హైకోర్టుకు కేఏ పాల్

విశాఖ ఉక్కు కోసం హైకోర్టుకు కేఏ పాల్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పిటీషన్ వేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని, ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు కేఏ పాల్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రమే అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని పాల్‌ పిటిషన్‌లో వెల్లడించారు.

క్యాపిటల్ మైనింగ్ అంశంలో ఉక్కు ఫ్యాక్టరీకి లీజు అనుమతులు వచ్చేలా చూడాలని తన పిటీషన్‌లో విజ్ఞప్తి చేశారు కేఏ పాల్. సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖ అంశాన్ని కూడా తన పిటిషన్‌లో ప్రస్తావించారు కేఏ పాల్. కేంద్ర మైనింగ్, ఉక్కు శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ, విశాఖ ఉక్కు కర్మాగారం, ఏపీ సీఎస్‌ను ప్రతివాదులుగా ఇందులో చేర్చారు కేఏ పాల్.