KA Paul: దీని జోలికి ఎవరొచ్చినా శాపం తగులుతుంది: కేఏ పాల్

KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని పోరాడుతున్న వారిలో 27 మంది కార్మికులను మే డే సందర్భంగా కలిశానని కేఏ పాల్ అన్నారు.

KA Paul: దీని జోలికి ఎవరొచ్చినా శాపం తగులుతుంది: కేఏ పాల్

KA Paul

KA Paul: విశాఖలోని స్టీల్ ప్లాంట్ జోలికి ఎవరొచ్చినా పాపం తగులుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఆ ప్లాంట్ కు ఉన్న 20 వేల ఎకరాల భూమిలోని 10 వేల ఎకరాల్లో తాను వందలాది కంపెనీలను తీసుకువస్తానని కేఏ పాల్ అన్నారు. దాదాపు 10 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని పోరాడుతున్న వారిలో 27 మంది కార్మికులను మే డే సందర్భంగా కలిశానని కేఏ పాల్ అన్నారు. విశాఖలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని తెలిపారు. “విశాఖ ఉక్కు పరిశ్రమ పారిశ్రామిక వేత్త అదానీది కాదు.. గుజరాతీలదు కాదు. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారిది.

దాని అమ్మకానికి ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడ 20 వేల ఎకరాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బలంగా లేవు. అందుకే మోదీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా పోరాడి, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోపోతే తెలుగు జాతికే అవమానం. ఈ ప్లాంట్ జోలికి ఎవరొచ్చినా శాపం తగులులుంది” అని కేఏ పాల్ అన్నారు.

కాగా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమేనని చెబుతున్న పలు పార్టీలు దాని కోసం పోరాడడం లేదని విమర్శలు వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగలేదని ఇప్పటికే కేంద్ర సర్కారు స్పష్టం చేసింది.

Srisailam Dam : శ్రీశైలం డ్యాంపై ప్రమాదం.. భయాందోళనలో సిబ్బంది, స్థానికులు