Kadapa District : బ్రహ్మంగారి మఠం, పీఠాధిపతులు రాక

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లయ్యపల్లెలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. దీనిని పరిష్కరించడానికి దాదాపు 20 నుంచి 25 మంది పీఠాధిపతులు ఇక్కడకు చేరుకున్నారు.

Kadapa District : బ్రహ్మంగారి మఠం, పీఠాధిపతులు రాక

Kadapa District

Brahmamgari Matam : కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లయ్యపల్లెలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. దీనిని పరిష్కరించడానికి దాదాపు 20 నుంచి 25 మంది పీఠాధిపతులు ఇక్కడకు చేరుకున్నారు. రెండు రోజులపాటు బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతులు ఉండనున్నారు. దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి కుటుంబ సభ్యులతో పాటు పలు సంఘాలతో వీరు సమావేశం కానున్నారు.

పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పాస్ తీసుకున్న వారిని మాత్రమే పీఠాధిపతులను కలిసేందుకు అనుమతినివ్వనున్నారు. అయితే..దివంగత పీఠాధిపతి రెండవ భార్య మారుతి విజయ లక్ష్మమ్మ పీఠాధిపతి విషయంలో ఇతరుల జోక్యం అవసరం లేదని డీజీపీకి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ  విషయంలో కుట్ర జరుగుతోందని మహాలక్ష్మమ్మ ఆరోపిస్తున్నారు. పెద్దభార్య కుమారునికి పీఠం అప్పగించేలా కుట్ర చేస్తున్నారని మహాలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర స్వామి పెద్దభార్య పెద్ద కొడుకు వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పీఠాధిపతులను ప్రభుత్వం పంపలేదని మహాలక్ష్మమ్మ అంటున్నారు.

పీఠాధిపతి వారసులు నాలుగు రోజుల సమయం అడిగారని శైవక్షేత్ర మఠాధిపతి శివస్వామి గుర్తు చేశారు శివస్వామి. బ్రహ్మంగారి వారసుల మధ్య వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించడానికి మఠాధిపతుల బృందం కృషి చేస్తోందని తెలిపారు. త్వరలో పీఠాధిపతిని నిర్ణయించి అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.