రూ.500 నోట్లు ఇస్తే రూ.2వేల నోట్లు ఇస్తాం.. కాకినాడలో ఘరానా మోసం, నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

  • Published By: naveen ,Published On : September 22, 2020 / 11:21 AM IST
రూ.500 నోట్లు ఇస్తే రూ.2వేల నోట్లు ఇస్తాం.. కాకినాడలో ఘరానా మోసం, నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. తమ దగ్గర రూ.200 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయంటూ వీడియో చూపించి మోసం చేయబోయింది ఓ ముఠా. 90లక్షల విలువ చేసే రూ.500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయల విలువ గల రూ.2వేల నోట్లు ఇస్తామని కాకినాడకు చెందిన నాగప్రసాద్‌ అనే వ్యక్తిని నమ్మించే ప్రయత్నం చేశారు.

అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. విశాఖకు చెందిన నలుగురు ముఠా సభ్యులతో పాటు.. కాకినాడకు చెందిన మరో వ్యక్తిని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వీడియోలో చూపించిన నకిలీ నోట్లు ఎక్కడున్నాయో గుర్తించే పనిలో పడ్డారు.

గతంలో కూడా ఇలాంటి మోసం ఒకటి వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. అది ఫేక్ వీడియో అని చెప్పారు. వీడియో చూపించి మరోసారి మోసం చేసేందుకు కొత్త ముఠా ఒకటి ప్రయత్నించిందన్నారు. నిందితులు అందరిపై చీటింగ్ కేసు పెట్టామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యాశకు పోతే అడ్డంగా మోసపోతారని హెచ్చరించారు. ఇలాంటి ముఠాలు సంప్రదిస్తే, వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.