Katari Hemalatha: రోడ్డుపై బైఠాయించిన కఠారి హేమలత.. పోలీస్ జీప్ మీదకు రావడంతో..

చిత్తూరు నగరంలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. నగర మాజీ మేయర్ కటారి హేమలత పైకి పోలీస్ జీపు ఎక్కడంతో కాలికి గాయలైనట్లు తెలుస్తుంది. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే చిత్తూరు హాస్పిటల్ కు తరలించారు.

Katari Hemalatha: రోడ్డుపై బైఠాయించిన కఠారి హేమలత.. పోలీస్ జీప్ మీదకు రావడంతో..

Katari Coupple

Katari Hemalatha: చిత్తూరు నగరంలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. నగర మాజీ మేయర్ కటారి హేమలత పైకి పోలీస్ జీపు ఎక్కడంతో కాలికి గాయలైనట్లు తెలుస్తుంది. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే చిత్తూరు హాస్పిటల్ కు తరలించారు.

కటారి మోహన్ దంపతుల హత్య కేసులో సాక్షుల ఇళ్ళల్లో గంజాయి ఉందనే నెపంతో అరెస్టు చేస్తున్నట్లు హేమలత అనుమానించారు. దీంతో పూర్ణ ఇంటికి వెళ్లేసరికి అప్పటికే పూర్ణ ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

నగర మాజీ మేయర్ కటారి హేమలత సాక్షులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ జీప్ కు అడ్డంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ జీప్ రివర్స్ లో వెళ్లడంతో కటారి హేమలత కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చిత్తూరు ఆస్పత్రికి తరలించారు.

హేమలతను పరామర్శించేందుకు గానూ చిత్తూరు ఆస్పత్రికి పలువురు టీడీపీ నేతలు చేరుకున్నారు. కొన్నేళ్ళ క్రితం జరిగిన కఠారి మోహన్, అనురాధ దంపతుల హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని కటారి హేమలత గురువారం సాయంత్రం మీడియాతో అన్నారు.

Read Also : నడిరోడ్డుపై మహిళ జుట్టు పట్టి ఈడ్చి ఈడ్చి కొట్టిన పోలీసులు..

2015 లో నాటి చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌లను మున్సిపల్ కార్యాలయం లోనే దారుణంగా హత్య చేశారు. ఈ దంపతుల దగ్గరి బంధువైన చింటూ కీలక సూత్రధారి అనే ఆరోపణలతో 7 ఏళ్లుగా కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.

కటారి దంపతుల హత్య కేసులో సాక్షులుగా ఉన్న పలువురు ఇప్పటికే కోర్టు ముందు హాజరుకాగా, జూన్ 30వ తేదీకి కేసు వాయిదా వేశారు. సాక్షులు అందరినీ ప్రవేశపెట్టాలని ఇదివరకే కోర్టు ఆదేశాలు అందాయి.

సాక్షులను అనేకరకాలుగా బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ.. కటారి దంపతుల కోడలు, మాజీ మేయర్ కటారి హేమలత హత్య కేసులోని కొందరు సాక్షులతో కలిసి
గురువారం సాయంత్రం చిత్తూరులో మీడియాతో మాట్లాడారు.

కఠారి హేమలత ఆరోపణల ప్రకారం.. కేసులో సాక్షిగా ఉన్న పూర్ణ అనే యువకుడి ఇంటికి గురువారం అర్ధరాత్రి వెళ్లిన పోలీసులు.. గంజాయి విక్రయిస్తున్నాడంటూ బలవంతంగా అరెస్ట్ చేసి జీప్ ఎక్కించారు. ఈ విషయం తెలిసి పోలీసులను అడ్డుకునేందుకు అక్కడకు వెళ్లిన కటారి హేమలత పోలీస్ జీప్‌కు వెనుక అడ్డంగా బైఠాయించారు. అలా పోలీస్ జీప్ తగలడంతో ఆమెకు గాయాలయ్యాయి.