ఎల్జీ పాలిమర్స్ కేసులో ఎన్జీటీ కీలక ఆదేశాలు 

  • Published By: bheemraj ,Published On : June 3, 2020 / 05:57 PM IST
ఎల్జీ పాలిమర్స్ కేసులో ఎన్జీటీ కీలక ఆదేశాలు 

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ వద్ద ఉంచిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణ, బాధితులకు పంచాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఒక్కొక్కరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ కలెక్టర్ సహా మరో ఇద్దరితో పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్ జీటీ సూచించింది.

రెండు నెలల్లో కమిటీ పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని..కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ కమిటీకి నోడల ఏజెన్సీగా వ్యవహరించాలని సూచించింది. పరిహారం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించడానికి మరో కమిటీని వేయాలని ఆదేశించింది. అలాగే అనుమతులు లేక్కుండా పరిశ్రమలు నడిపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ ను ఆదేశించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. 

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ కేసులో జాతీయ హరిత ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు. రెండు నెలలోగా ఎటువంటి చర్యలు తీసుకున్నారో తమకు తెలియపర్చాలని ఆదేశించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి, విచారించే అధికారం ఎన్ జీటీకి ఉందని స్పష్టం చేశారు.

మొదటి నుంచి సుమోటోగా స్వీకరించే అధికారాలు ఎన్జీటీకి లేవని ఎల్జీ పాలిమర్స్ చెబుతున్నారు. అయితే పర్యావరణ నిబంధనలు ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు ఎన్ జీటీ చూస్తూ ఊరుకోదని చెప్పింది. అంతే కాకుండా కీలక ఆదేశాలు ఇచ్చింది. కలెక్టర్ వద్ద ఉంచిన రూ50 కోట్లను పర్యావరణ పునురుద్ధరణ, బాధితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు వినియోగించాలని ఎన్ జీటీ స్పష్టం చేసింది. అలాగే కొన్ని కమిటీలు వేశారు. తదుపరి విచారణను నవంబర్ 3 వాయిదా వేసింది.