ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో ముగ్గురిపై శానిటైజర్ చల్లి నిప్పుపెట్టిన నిందితుడు.. విజయవాడ మర్డర్ ప్లాన్ కేసులో కీలక విషయాలు

  • Published By: bheemraj ,Published On : August 18, 2020 / 04:35 PM IST
ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో ముగ్గురిపై శానిటైజర్ చల్లి నిప్పుపెట్టిన నిందితుడు.. విజయవాడ మర్డర్ ప్లాన్ కేసులో కీలక విషయాలు

విజయవాడ మర్డర్ ప్లాన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు వేణుగోపాల్ రెడ్డి శానిటైజర్ చల్లి కారుకు నిప్పుపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. వేణుగోపాల్ రెడ్డిని వ్యాపారంలో గంగాధర్ దంపతులు కృష్ణారెడ్డి మోసగించారని, వారు రూ.3 కోట్లు ఇవ్వాల్సివుందని గుర్తించారు. గంగాధర్ దంపతులు, కృష్ణారెడ్డి డబ్బులు ఇవ్వకపోవడంతో ఒత్తిడి లోనైన వేణుగోపాల్ రెడ్డి ఆ ఒత్తిడిలోనే ముగ్గురిపై శానిటైజర్ చల్లి నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



విజయవాడలోని కారు యాక్సిడెంట్ అత్యాయత్నం కేసులో పోలీసులు విచారించే కొద్ది కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. వేణుగోపాల్ రెడ్డికి సంబంధించిన కారు తీసుకొచ్చి ఆ కారు ముందే శానిటైజర్ చేసి ఉంది. నోవాటెల్ హోటల్ లో ల్యాండ్ కు సంబంధించి ఓ వ్యక్తి ఉన్నాడని.. చెప్పి వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చి వారిపై చల్లారు. అతను అగ్గిపుల్ల అంటించిన వెంటనే ఒక్కసారిగా కారు ఫైర్ అయింది. వేణుగోపాల్ రెడ్డి పక్కా ప్లాన్, ప్రణాళికతోనే చేశారని పోలీసుల విచారణలో తేలింది. వేణుగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైలవరంకు సంబంధించి 2014 సంవత్సరంలో రియల్ ఎస్టేట్ కు సంబంధించి గంగాధర్ దంపతులు, కృష్ణారెడ్డి కూడా వేణుగోపాల్ రెడ్డికి ఆర్థికంగా రూ.3 కోట్లపైనే డబ్బులు ఇవ్వాల్సివుంది. అయితే ఇప్పుటికీ అతనికి డబ్బులు ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తోంది.



వేణుగోపాల్ రెడ్డి కూడా రూ.7 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్ కు బదిలి చేయడం, యూజ్డ్ కారు కొనడంతో వ్యాపారాల్లో నష్టం జరిగింది. దీంతో తనకు రావాల్సిన రూ.3 కోట్లు ఇవ్వాలని కృష్ణారెడ్డితోపాటు గంగాధర్ దంపతులను అడిగారు. గంగాధర్ దంపతులు డబ్బులు ఇవ్వకుండా తాడేపల్లి గూడెంలో ల్యాండ్ ఉంది..దాన్ని వేణుగోపాల్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేస్తామని, దాని విలువ మూడు కోట్లపైనే ఉంటుందని చెప్పారు.



అయితే ఆరు నెలల నుంచి చెబుతున్నాడు గానీ ల్యాండ్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడాన్ని ముందుకు రావడం లేదు. ల్యాండ్ కొనడానికి విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో పార్టీ ఉందని నమ్మించి ఉదయం నుంచి అక్కడికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే గంగాధర్ దంపతులు, కృష్ణారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు.
గంగాధర్ దంపతులకు ఆర్థికంగా ఉన్నప్పటికీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని వేణుగోపాల్ రెడ్డి గ్రహించారు.



డబ్బులు ఇవ్వకపోగా తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ వేణుగోపాల్ రెడ్డి వారిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారని పోలీసుల విచారణ తేలింది. కృష్ణారెడ్డి..తనకు బంధువు అయివుంది కూడా డబ్బులు ఇవ్వకపోగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో కృష్ణారెడ్డిపై కూడా పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్లు వేణుగోపాల్ రెడ్డికి పోలీసులకు చెప్పారు. తను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో చాలా ఆవేదనకు గురయ్యారని వాపోయారు.



అప్పుల వారు ఇంటికి రావడంతో తన కుటుంబం మొత్తం మనోవేధనకు గురవుతుందని చెప్పారు. కృష్ణారెడ్డి కూడా వేణుగోపాల్ రెడ్డిని ఇబ్బంది పెట్టినట్లు పోలీసులు తెలిపారు. గంగాధర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంత డబ్బులు ఇవ్వాలి? ఎందుకు ఇ్వవడం లేదు. ఆర్ధిక లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? గంగాధర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.