Gudivada : మంత్రి పదవి వెంట్రుకతో సమానం.. కొడాలి నాని కామెంట్స్

తనకు మంత్రి పదవి దక్కలేదని ఏమీ బాధ లేదని అయితే.. ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారని విమర్శించారు. దేవుడులాంటి వైఎస్ఆర్ ను...

Gudivada : మంత్రి పదవి వెంట్రుకతో సమానం.. కొడాలి నాని కామెంట్స్

Former Minister Kodali Nani

Kodali Nani Gudivada : మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానం.. గుడివాడ ఎమ్మెల్యేగా ఉండడమే ఇష్టం.. జగన్ వెనుక ఉండి పని చేయడమే ముఖ్యమని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. 420 గ్యాంగ్ , చంద్రబాబు దత్త పుత్రుడు, సొంత పుత్రుడు.. రాష్ట్రం శ్రీలంక అవుతుందని విషప్రచారం చేస్తున్నారని.. జగన్ లాంటి వ్యక్తులను పొగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని తెలిపారు. 2022, గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత.. నియోజకవర్గంలో జరిగిన తొలి కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నానికి వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో కొడాలి నాని మాట్లాడుతూ… గుడివాడ ఎమ్మెల్యేగా ఉండటమే తనకు ఇష్టమని పేర్కొన్న ఆయన మాజీ మంత్రి అని పిలవొద్దన్నారు.

Read More : Kodali Nani : పశువుల కొట్టంలో పడుకున్న మాజీ మంత్రి కొడాలి నాని

తనకు మంత్రి పదవి దక్కలేదని ఏమీ బాధ లేదని అయితే.. ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారని విమర్శించారు. దేవుడులాంటి వైఎస్ఆర్ ను కోల్పోయిన తర్వాత.. రాష్ట్రం రెండు ముక్కలై సర్వనాశనం అయ్యిందన్నారు. బాబూ జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బతికున్నంతకాలం ప్రజాప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఇదే సభలో పాల్గొన్న ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు వయసు అయిపోయితున్పప్పుడు ఎప్పుడేం మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ తెల్ల మొహం వేసుకొని రాష్ట్రంలో తిరుగుతున్నారని విమర్శించారు. సభ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు కొడాలి నాని నిరాకరించడం గమనార్హం.

Read More : Kodali Nani: రాజీనామా తర్వాత కొడాలి నాని రియాక్షన్

జగన్ కోసం తన వాయిస్ ను ఏ మాత్రం మొహమాటం లేకుండా పలు వ్యాఖ్యలు చేసే వారిలో కొడాలి నాని ఒకరు. చంద్రబాబుపై తనదైన శైలిలో మాటలతో విరుచుకుపడటంలో కొడాలి ముందుంటారు. మొదటి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇటీవలే సీఎం జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణ జరిపారు. కొడాలి నాని లాంటి వ్యక్తికి మరోసారి మంత్రి పదవి దక్కుతుందని అందరు భావించారు. కానీ జగన్ మాత్రం తనదైన శైలిలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టి అందరికి షాక్ ఇచ్చారు. కొడాలి నానికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. మంత్రి పదవి పోయాక కొడాలి నాని పెద్దగా బయట కనిపించడం లేదు. ఇంటికే పరిమితమవుతున్నారు. ఆయన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నట్లుగా తెలస్తోంది. ఈ క్రమంలో సడెన్ గా కొడాలి పశువుల కొట్టంలో కనిపించిన ఫొటో తెగ వైరల్ గా మారింది. మంత్రి పదవి తనకు అవసరం లేదని, పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పిన ఆయన… అంత యాక్టివ్ గా కనిపించడం లేదని నెటిజన్లు అంటున్నారు.