Kodali Nani : ఎన్టీఆర్‌పై కుట్ర చేసి, నిందలేసి చంద్రబాబుని సీఎం చేశారు-కొడాలి నాని

మాజీమంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, నారాలోకేశ్ లపై నిప్పులు చెరిగారు. తీవ్ర విమర్శలు చేశారు. గన్నవరం గొడవలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కొడాలి నాని తప్పుపట్టారు. టీడీపీ నేత పట్టాభి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిప్పాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు.

Kodali Nani : ఎన్టీఆర్‌పై కుట్ర చేసి, నిందలేసి చంద్రబాబుని సీఎం చేశారు-కొడాలి నాని

Kodali Nani : మాజీమంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, నారాలోకేశ్ లపై నిప్పులు చెరిగారు. తీవ్ర విమర్శలు చేశారు. గన్నవరం గొడవలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కొడాలి నాని తప్పుపట్టారు. టీడీపీ నేత పట్టాభి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిప్పాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు.

ఎన్టీఆర్ ప్రజలను నమ్మి పార్టీ పెట్టారన్న కొడాలి నాని.. ఎన్టీఆర్ పై కుట్ర చేసి, నిందలు వేసి చంద్రబాబుని సీఎం చేశారని ఆరోపించారు. పట్టాభిని గన్నవరం ఎవరు పంపించారు? నేను కానీ వంశీ రమ్మని చెప్పామా? అని కొడాలి నాని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వైస్సార్, ఎన్టీఆర్ కన్నా ఎక్కువ ప్రాధాన్యం జగన్ ఇస్తున్నారని ఆయన చెప్పారు. పోలీస్ వ్యవస్థపై అభాండాలు వేస్తూ కులాలు, మతాలు అంటగడుతున్నారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. పట్టాభి పనికిమాలిన 420 అంటూ ధ్వజమెత్తారాయన.

Also Read..Chandrababu Naidu : జగన్ ఓటమి ఖాయం, ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

టీడీపీ బీసీ నాయకులపై దాడి అని చంద్రబాబు, లోకేష్ అంటున్నారు. మరి గన్నవరంలో అరెస్ట్ అయిన బీసీ నేతల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారా? అని కొడాలి నాని అడిగారు. వైఎస్ వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్ జరిగిందని సీబీఐ కన్నా ముందే లోకేశ్ చెప్పారు.. మరి ఈ డీల్ గురించి లోకేశ్ ముందే ఎలా చెప్పారు అని కొడాలి నాని నిలదీశారు.

సీబీఐని రాష్ట్రంలో బ్యాన్ చేసింది చంద్రబాబు అని గుర్తు చేసిన కొడాలి నాని.. సీబీఐ అధికారులు చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆరోపించారు. సీబీఐ, చంద్రబాబు సీఎం జగన్ ని ఏమీ చేయలేవు అని కొడాలి నాని తేల్చి చెప్పారు. సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడంపైనా కొడాలి నాని స్పందించారు.

Also Read..Chandrababu Naidu: రాష్ట్రంలో ఉండే సంపద అంతా తనవద్దే ఉండాలని జగన్ ఉద్దేశం: చంద్రబాబు

కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ పక్కన పెట్టిందన్నారు. అలాంటి వ్యక్తిని చంద్రబాబు అక్కున చేర్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చిటికేస్తే ఏం చేయగలవో చెప్పాలని లోకేశ్ ను అడిగారు. కొడుకుని చూసి చంద్రబాబు రగిలిపోతున్నారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు భార్య కోసం బయట, కొడుకు కోసం లోపల ఏడుస్తారు అని కొడాలి నాని చెప్పారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.