Kodi kathi Case : తెరపైకి కోడి కత్తి కేసు..సీజేఐకి లేఖ రాసిన నిందితుడి తల్లి

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం  సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు తల్లి  సావిత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి  ఈరోజు లేఖ రాశారు.

Kodi kathi Case : తెరపైకి కోడి కత్తి కేసు..సీజేఐకి లేఖ రాసిన నిందితుడి తల్లి

Kodi Kathi Case

Kodi kathi Case :  ఆంధ్రప్రదేశ్ లో సంచలనం  సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు తల్లి  సావిత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి  ఈరోజు లేఖ రాశారు. తన కుమారుడిని తక్షణమే విడుదల చేయాలని ఆమె ఆ లేఖలో కోరారు.

సుమారు   నాలుగేళ్లుగా తన కుమారుడు రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం, ఎన్‌ఐఏ ఎలాంటి విచారణ జరపడం లేదని లేఖలో సావిత్రి పేర్కొన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019  అక్టోబర్ నెలలో విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.  అక్టోబర్ 25 వ తేదీన ఆయన హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

అక్కడ ఓ యవకుడు ఒక్కసారిగా కోడి పందేల్లో వాడే కత్తితో జగన్‌పై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.  కేసును ఎన్ఐఏ విచారణ చేపట్టింది. అప్పటి అధికార పార్టీ టీడీపీయే జగన్ పై దాడి చేయించిందని వైసీపీ, ఎన్నికల్లో   సింపతీ కోసమే    వైసీపీ ఈడ్రామా ఆడిందని టీడీపీ  ఒకరి నొకరు విమర్శించుకున్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది అధికారాన్ని చేజిక్కుంచుకుంది.