Thirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటల నుండి దర్శనాలు ప్రారంభం అవుతాయి.

Thirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Tirumala (1)

Koil Alwar Thirumanjanam : తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమం జరగనుంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ఉదయం 11 గంటల నుండి దర్శనాలు ప్రారంభం అవుతాయి. ఈ నెల 7 నుండి 15 వరకూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

కోవిడ్ 19 నిబంధనల కారణంగా టీటీడీ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనుంది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మొదట కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది.

Tirumala Brahmotsavams : ఈనెల 7 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంత‌రం భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమనజనం కార్యక్రమం ఉండటంతో విఐపీ దర్శనాలు రద్దు చేశారు.

ప్రతి ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నెల 11న గరుడ సేవ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Cheating: శ్రీవారి నకిలీ దర్శనం టికెట్లు.. టీటీడీ చైర్మన్ పేరుతో భక్తులకు బురిడీ

ముఖ్యమంత్రి చేత పలు ప్రారంభోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అలిపిరివద్ద నూతనంగా నిర్మించిన గో మందిరము, తిరుమలలో నూతన బందిపోటును ముఖ్యమంత్రి చేత ప్రారంబించడానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. అలిపిరి మెట్ల మార్గం, బర్డ్ ఆస్పత్రిలో చిన్న పిల్లల కార్డియాక్ విభాగాన్ని సీఎం చేత ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.