Kotamreddy Sridhar Reddy : కోటంరెడ్డి హితబోధ ఎవరికి? వైసీపీలో హాట్ టాపిక్‌గా మారిన శ్రీధర్ రెడ్డి కామెంట్స్

ప్రతిపక్ష నేతలను శత్రువుల్లా చూడొద్దని, వారిని వేధించొద్దని.. వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలను ఆలోచింపజేస్తున్నాయి.

Kotamreddy Sridhar Reddy : కోటంరెడ్డి హితబోధ ఎవరికి? వైసీపీలో హాట్ టాపిక్‌గా మారిన శ్రీధర్ రెడ్డి కామెంట్స్

Kotamreddy Sridhar Reddy

Kotamreddy Sridhar Reddy : నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలను ఆలోచింపజేస్తున్నాయి. ప్రతిపక్ష నేతలను శత్రువుల్లా చూడొద్దని, వారిని వేధించొద్దని సొంత పార్టీ నేతలకు హితవు పలికారు కోటంరెడ్డి. విపక్ష నేతలను కేవలం రాజకీయ పోటీదారులుగా మాత్రమే చూడాలన్న కోటంరెడ్డి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఎంత తగ్గితే అంత మంచిది అంటూ వైసీపీ శ్రేణులకు కోటంరెడ్డి చేసిన హితబోధ హాట్ టాపిక్ గా మారింది.

YS Jagan: ఆత్మకూరు ఉప ఎన్నికలో ఘన విజయంపై జగన్ ఆసక్తికర ట్వీట్..

అధికార మదంతో ప్రవర్తించినా, అధికార మదం తలకెక్కినా ప్రజలు వాత పెడతారన్న కోటంరెడ్డి కామెంట్.. సొంత పార్టీ నేతలకు చురకలు అంటించినట్లుగా కనిపిస్తున్నాయ్. వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసి, అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్న విమర్శలు టీడీపీ నుంచి వెల్లువెత్తుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉందని భావిస్తున్నారు. టీడీపీ శ్రేణులపై పెడుతున్న కేసులు వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నాయని కోటంరెడ్డి భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడవద్దని వైసీపీ శ్రేణులకు సూచించడంపైన కోటంరెడ్డిపై కొందరు గుర్రుగా ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షంపై వేధింపులకు పాల్పడొద్దని కోటంరెడ్డి సూచించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇబ్బందులు పెడితే కష్టాలు తప్పవన్న వాదాన్ని వినిపించడంపై అందరూ ఆలోచనలో పడ్డారు. ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఎంత తగ్గితే అంత మంచిదనే విషయాన్ని వైసీపీ కేడర్ కు గుర్తు చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

AP Politics: అప్పుడు తేలిపోద్ది పులి ఎవడో.. పిల్లి ఎవడో!.. విజయసాయికి అయ్యన్న పాత్రుడు కౌంటర్

ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలన్నారు. అలా కాదని పెత్తనం చేస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుందంటూ కోటంరెడ్డి చేసిన హితబోధపై వైసీపీ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అందరినీ ప్రేమించాలే కానీ ద్వేషించకూడదన్నది శ్రీధర్ రెడ్డి వాదన. రాజకీయాల్లో శత్రువులను కూడా మిత్రులుగా చూడాలని వైసీపీ నేతలకు సూచించడం జిల్లా రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. అధికారులు, ఉద్యోగులపై పెత్తనం చెలాయించ వద్దన్న సూచన.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచితనంతో మెలుగుతూ పనులు చేయించుకోవాలే కానీ, అధికారం ఉందని దురుసుగా వ్యవహరిస్తే.. దుష్పలితాలు తప్పవనే ధోరణిలో కోటంరెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw