Kotamreddy Sridhar Reddy : ఇంటెలిజెన్స్ చీఫ్‌పై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు, ట్రాప్‌లో పడొద్దని ఉండవల్లికి విజ్ఞప్తి

Kotamreddy Sridhar Reddy: ఉండవల్లి అరుణ్ కుమార్ తో రామోజీరావుపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Kotamreddy Sridhar Reddy : ఇంటెలిజెన్స్ చీఫ్‌పై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు, ట్రాప్‌లో పడొద్దని ఉండవల్లికి విజ్ఞప్తి

Kotamreddy Sridhar Reddy (Photo : Google)

Kotamreddy Sridhar Reddy : రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక రాజకీయ దళారీగా మారారని విమర్శించారు. ఆయన వ్యవహారశైలి బాగోలేదన్నారు. ఆయన తన విధులు మరిచి.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల కార్యకలాపాలను పోలీస్ బలంతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ మెహర్బానీ కోసం సీతారామాంజనేయులు ఇదంతా చేస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు.

ఉండవల్లి అరుణ్ కుమార్ తో రామోజీరావుపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించేందుకు రామాంజనేయులు ప్రయత్నిస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. వైసీపీ ట్రాప్ లో పడొద్దని ఉండవల్లిని కోరారు. సీతారామాంజనేయులు దగ్గరుండి అంతా చేస్తున్నారని కోటంరెడ్డి అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తో కలిసి రహస్య ప్రణాళిక రూపొందించారని చెప్పారు.(Kotamreddy Sridhar Reddy)

Also Read..Sai Kalyani Mulpuri : మూల్పూరి కళ్యాణి అరెస్ట్.. ట్విటర్ లో ఖండించిన చంద్రబాబు, లోకేశ్

రామోజీరావు గురించి వైసీపీ నేతలు చెప్పే మాటలు ఢిల్లీలో ఎవరూ వినడం లేదని, అందుకే ఈ వ్యవహారంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ని వాడుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని కోటంరెడ్డి అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ని వైసీపీ నేతలు, ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు ట్రాప్ చేస్తున్నారని చెప్పారు. వారి ట్రాప్ లో పడొద్దని ఉండవల్లికి విజ్ఞప్తి చేశారు కోటంరెడ్డి. మార్గదర్శిపై అక్రమ కేసులు పెట్టి రామోజీరావుని, ఆయన కుటుంబసభ్యులను వేధిస్తున్నారని కోటంరెడ్డి వాపోయారు. మార్గదర్శి వల్ల నష్టపోయాము అంటూ కనీసం ఒక్కరైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఒక్కరన్నా మార్గదర్శి ఆఫీసుకెళ్లి తమ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారా అని నిలదీశారు.

సీతారామాంజనేయులుకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్ వర్క్ ఉంటే.. తనకు ఆయన దగ్గరే నెట్ వర్క్ ఉందన్నారు కోటంరెడ్డి. ఇంటెలిజెన్స్ చీఫ్ విషయాలన్నీ తనకు తెలిసిపోతాయన్నారు. ఇంక 6 నెలలు మాత్రమే నీ అధికారం ఉంటుందని, రాజకీయ దళారిగా చేస్తున్న వ్యవహారాలకు మూల్యం చెల్లిస్తారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.(Kotamreddy Sridhar Reddy)

Also Read..BJP Operatain south : దక్షిణాదిపై కన్నేసిన కాషాయదళం, ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులపై బీజేపీ నజర్

కాగా, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై కోటంరెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలోనే ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేసిన కోటంరెడ్డి, ఆ సమయంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుపై సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో తనకు ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు కోటంరెడ్డి. ఇప్పుడు మరోసారి ఇంటెలిజెన్స్ చీఫ్ టార్గెట్ గా కోటంరెడ్డి చెలరేగిపోయారు. రాజకీయ దళారి అంటూ ఇంటెలిజెన్స్ చీఫ్ పై విరుచుకుపడ్డారు. అధికార పార్టీ రాజకీయ ప్రత్యర్థులను, ఉద్యోగులను వేధిస్తున్నారని చెప్పారు.

ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఉద్దేశించి కోటంరెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కోటంరెడ్డి చెప్పినట్లుగా ఉండవల్లిని వైసీపీ నేతలు వాడుకుంటున్నారా? ఆయన రామోజీరావుపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టబోతున్న విషయం నిజమేనా? అనేది ఆసక్తికరంగా మారింది.