Gannavaram: జగన్ పై పోస్టులు.. ప్రవాసాంధ్రుడి అరెస్టు.. చంద్రబాబు మండిపాటు

నిన్న సాయంత్రం అంజన్ నిద్రిస్తున్న సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు అంజన్ తల్లి రత్నకుమారిని "మీ అబ్బాయి ఉన్నాడా"? అని అడిగారు. అనంతరం అంజన్ ని నిద్రలేపి పలు అంశాలపై ప్రశ్నించారు.

Gannavaram: జగన్ పై పోస్టులు.. ప్రవాసాంధ్రుడి అరెస్టు.. చంద్రబాబు మండిపాటు

Gannavaram

Gannavaram: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేస్తున్నాడని ఓ ప్రవాసాంధ్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం, రాయ్ నగర్ కు చెందిన కోటిరత్నం అంజన్ అనే యువకుడు అమెరికాలో 5 సంవత్సరాలు ఉండి, తన సొంత ఊరికి వచ్చాడు.

నిన్న సాయంత్రం గన్నవరం పోలీసులు అంజన్ ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. నిన్న సాయంత్రం అంజన్ నిద్రిస్తున్న సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు అంజన్ తల్లి రత్నకుమారిని “మీ అబ్బాయి ఉన్నాడా”? అని అడిగారు. అనంతరం అంజన్ ని నిద్రలేపి పలు అంశాలపై ప్రశ్నించారు. అంజన్ ఫోన్, ల్యాప్ టాప్, బ్యాంక్ లావాదేవీలు అడిగి తీసుకున్నారు. అంజన్ కి సోషల్ మీడియాపై ఆసక్తి ఎక్కువ అని అతడి తల్లి రత్నకుమారి చెప్పారు. నిన్న సాయంత్రం అంజన్ ని తీసుకువెళ్లారు గన్నవరం పోలీసులు.

ఇప్పటివరకు అంజన్ ఎక్కడ ఉన్నాడో తల్లిదండ్రులకు పోలీసులు తెలపలేదు. అంజన్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. తమ అబ్బాయిని చూపించండని, కనీసం ఫోన్ లోనయినా మాట్లాడించండని అడిగారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు తీరుపై అంజన్ తల్లి దండ్రులు మండిపడుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానికి వెళ్లినప్పటికీ తమ ఫిర్యాదు తీసుకోలేదని తల్లి రత్నకుమారి తెలిపారు.

చంద్రబాబు ఖండన
పోలీసులు అక్రమంగా నిర్బంధించిన గన్నవరం యువకుడు అంజన్ ను వెంటనే విడుదల చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. సీఎంపై పోస్ట్ పెట్టాడని అంజన్ ను నిన్న తీసుకువెళ్లిన పోలీసులు ఇప్పటికీ అతని ఆచూకీ చెప్పకపోవడం నిబంధనల ఉల్లంఘనే అని అన్నారు. డీజీపీ తప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంజన్ ను వెంటనే విడుదల చేయాలని అన్నారు.
Fire Broke Out : శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. దువ్వ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం