Andhra Pradesh: సీఎం జగన్ ఒక్కరే అలా చేశారు.. వారు చట్టసభలో అడుగు పెట్టేలా చేస్తారు..

బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు పునరుద్ఘాటించారు.

Andhra Pradesh: సీఎం జగన్ ఒక్కరే అలా చేశారు.. వారు చట్టసభలో అడుగు పెట్టేలా చేస్తారు..

AP Ministers: బీసీలకు సీఎం వైఎస్ జగన్ అన్నివిధాలా అండగా నిలిచారని, రాజకీయంగా నిలబెట్టారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో మంగళవారం నాయీబ్రాహ్మణులు (Nayee Brahmin) ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. అన్ని ఆలయాల పాలక మండలిలో స్థానం కల్పించడంతో పాటు.. జగనన్న చేదోడు కింద ప్రతి ఏటా రూ.10వేల చొప్పున సాయం, ఆలయాలలో పనిచేసే వారికి రూ.20 వేలు వేతనం ఇస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభ ఏర్పాటు చేశారు. నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య (Yanadaiah Siddavatam) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు హాజరయ్యారు.

Jogi Ramesh Kottu Satyanara
మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్: కొట్టు

చంద్రబాబు హయాంలో ఒక సామాజిక వర్గం తప్ప మరెవరూ బాగు పడలేదని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ(kottu satyanarayana) అన్నారు. ‘బలహీన వర్గాలను చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
చేసిందని విమర్శించారు. కులవృత్తులు చేసుకునేవారు తమ సమస్యలు పరిష్కారించమని చంద్రబాబును కోరితే మీ తోకలు కత్తిరిస్తామంటూ బెదిరించారు. ఇవే సమస్యలు జగన్ కి చెప్తే ఎంతో సానుకూలంగా స్పందించారు. ఎంత వీలైతే అంత మేలు చేయాలని నాకు సీఎం చెప్పారు. జీవో 110 ద్వారా నాయీబ్రాహ్మణులకు మేలు చేయగలిగాం. ముకేష్ అంబానీ (Mukesh Ambani) లాంటి వాళ్లు సెలూన్ బిజినెస్ చేస్తున్నారు. నాయీ బ్రాహ్మణులు మరింత సమర్ధవంతంగా పని చేయాలి. పోటీని ఎదుర్కొని నిలపడాలి. నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్’ అని తెలిపారు.

Jogi Ramesh
చంద్రబాబుకు బీసీలంటే చిన్నచూపు: జోగి రమేశ్

బీసీలకు సీఎం జగన్ అన్నివిధాలా అండగా నిలిచారని మంత్రి జోగి రమేశ్ Jogi Ramesh అన్నారు. ‘బీసీలలో ఎన్ని కులాలు ఉంటాయో కూడా తెలియని మనల్ని రాజకీయంగా నిలపెట్టారు. నాయీబ్రాహ్మణులు సైతం చట్టసభలో అడుగు పెట్టేలా చేస్తారు. అది త్వరలోనే జరుగుతుంది. ఆ దమ్ము, ధైర్యం కేవలం జగన్ కే సాధ్యం. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ బీసీల కష్టాలు చూశారు అందుకే అనేక సంక్షేమ పథకాలు తెచ్చి అండగా నిలిచారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు. చంద్రబాబుకు బీసీలంటే చిన్నచూపు. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ అవహేళన చేశారు. ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు, కంబళ్లు ఇచ్చి ఇక మీకు చాల్లే అంటాడు. కానీ జగన్ వలన మన పిల్లలు నేడు పెద్దపెద్ద చదువులు చదువుతున్నారు. ఆలయాల పాలక మండలిలో సైతం నాయీబ్రాహ్మణులు సభ్యులయ్యార’ని మంత్రి రమేశ్ చెప్పారు.

Also Read: నన్ను చంపొచ్చు.. కానీ ధర్మాన్ని చంపలేరు.. అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు


సీఎం జగన్ ఒక్కరే అలా చేశారు: సజ్జల

అణగారిన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పని చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) తెలిపారు. ‘సమాజంలో అణగారిన వర్గాలు కూడా బాగా బతకడమే ప్రజాస్వామ్యం. ఒకప్పుడు వృత్తులపై ఆధారపడి గౌరవంగా జీవించిన వారు ఇప్పుడు వెనకబడ్డారు. మారుతున్న కాలంలో ఈ అణగారిన వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం పని చేస్తోంది. ఆచరణలో ప్రణాళికాబద్దంగా అన్ని వెనకబడిన వర్గాలకు మేలు చేసేది సీఎం జగన్ ఒక్కరే. ప్రభుత్వం సంక్షేమ పరంగా ఎలా ఉండాలి అని చూపించింది జగన్ మాత్రమే. పదేళ్లలో జరగాల్సిన అభివృద్ధిని నాలుగేళ్లలో చూపించారు జగన్. చంద్రబాబు 40 ఏళ్లు అయినా ఇలాంటి కార్యక్రమాలు చెయ్యలేదు. ఎక్కువమంది పేదలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రయోజనం కలిగించే విధంగా పాలన ఉంద’ని సజ్జల అన్నారు.

Also Read: ఏపీలో సంచలన రాజకీయ మార్పులు.. జగన్ కు త్వరలో షాక్ తగలబోతోంది..