Kottu Satyanarayana: అలాగైతే నిన్ను ఫుట్ బాల్ తన్నినట్టు తంతారు: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

చంద్రబాబుకు ఓటు వెయ్యమన్న పవన్ కల్యాణ్ మరి ఆయన చేస్తున్న తప్పులను ప్రశ్నించారా? అని కొట్టు సత్యనారాయణ నిలదీశారు.

Kottu Satyanarayana: అలాగైతే నిన్ను ఫుట్ బాల్ తన్నినట్టు తంతారు: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

Kottu Satyanarayana

Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ అవసరం తీరిపోయినా, లేకపోయినా ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) ఫుట్ బాల్ తన్నినట్టు తంతారని చెప్పారు. ఏపీలోని తాడేపల్లిగూడెం, నవాబుపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కొట్టు సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడారు.

“చంద్రబాబుకు ఓటు వెయ్యమన్న పవన్ కల్యాణ్ మరి ఆయన చేస్తున్న తప్పులను ప్రశ్నించారా? ప్రశ్నించడానికి పెట్టిన పార్టీలో ప్రశ్నించకపోతే ఎలా? కాపులు సీఎం కావాలంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ కాపులను మోసం చేస్తున్నారు.

కాపు యువత జనసేన కోసం పని చేస్తే పవన్ కల్యాణ్ 2024లో చంద్రబాబుతో కలవాలని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని దించడానికి ఎవరూ సరిపోరు. చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోయింది. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అవసరం లేకపోతే ఫుట్ బాల్ తన్నినట్టు తన్నుతారు.

పవన్ మీటింగ్ లో సీఎం సీఎం సీఎం సీఎం అంటూ యువత కేకలు వేస్తుంటే పవన్ మాత్రం తాను సీఎం పదవికి అర్హుడు కాదని అంటున్నారు. చంద్రబాబు వల్ల పవన్ కు వందల కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుంది” అని కొట్టు సత్యనారాయణ అన్నారు.

YS Vivkea Case : వైఎస్ వివేకా కేసులో సీబీఐ సంచలనం.. కౌంటర్ అఫిడవిట్‌లో సీఎం జగన్ పేరు ప్రస్తావన