మా వాళ్లు ఎట్లున్నారో : న్యూయార్క్, న్యూజెర్సీలలో తెలుగువారు బెంబేలు

  • Published By: madhu ,Published On : March 25, 2020 / 01:56 AM IST
మా వాళ్లు ఎట్లున్నారో : న్యూయార్క్, న్యూజెర్సీలలో తెలుగువారు బెంబేలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య అధికమౌతుండడం, మరణాల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. విదేశాల్లో ఉన్న తెలుగు వారు బిక్కు బిక్కమంటు గడుపుతున్నారు. తమ కుటుంబసభ్యులు ఎలా ఉన్నారనని తల్లడిల్లిపోతున్నారు.

న్యూజెర్సీ, న్యూయార్క్ నగరాల్లో ఎక్కువగా తెలుగు వారు నివాసం ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే..ఇక్కడ కేసులు అధికంగా నమోదవుతుండడంతో తెలుగు వారు బెంబేలెత్తిపోతున్నారు. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం సాయంత్రానికి న్యూయార్క్ నగరంలో 29 వేల 875 కేసులు, న్యూజెర్సీలో 2 వేల 844 మంది కరోనా బారిన పడ్డారు. ఇతర నగరాల్లో పోలిస్తే…ఈ రెండు నగరాల్లో కేసుల నమోదు తక్కువగానే ఉంది. కానీ అనూహ్యంగా పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. 

న్యూయార్క్ లో 157 మంది, న్యూజెర్సీలో 27 మంది చనిపోయారు. ఈ పరిస్థితుల్లో అక్కడున్న తెలుగు వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లో 7.68 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారని అంచనా. ఇది రెండు సంవత్సరా క్రితం లెక్కలు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ గడపదాటి బయటకు రావడం లేదు. వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండడమే ఇందుకు కారణం. తాము బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోందని, నెల రోజులకు సరిపడే సరుకులు..రెండు నెలలకు వచ్చే విధంగా వాడుకొనే పరిస్థితి ఉందని కొందరు వాపోతున్నారు.

ఇక్కడున్న తెలుగువాళ్లల్లో గర్భవతులు కూడా ఉన్నారు. ఇలాగే..శ్రీదేవి అనే మహిళ 8 నెలల గర్భవతి. నేను, నా భర్త మాత్రమే ఇక్కడున్నామని, ఇక్కడకు రావడానికి తన తల్లిదండ్రులు నిర్ణయించుకున్నా..ప్రస్తుతం అది నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని…ఏప్రిల్ 20-22 డెలీవరి టైం వైద్యులు నిర్ణయించారని, తన పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయంటూ ఆమె పెట్టిన వాట్సాప్ అందరినీ కదిలించి వేస్తోంది. తాము అండగా ఉంటామని అక్కడి తెలుగు మహిళలు మద్దతు ప్రకటించారు. 
Also Read | డౌట్ వద్దు.. ఫుల్ అమౌంట్ వచ్చేస్తది.. అలా చెయ్యొద్దు