Bhuma Akhila Priya : భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు

ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు అయ్యింది.

Bhuma Akhila Priya : భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు

bhuma akhila priya

Bhuma Akhila Priya : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈ దాడి కేసులో సబ్ జైలులో ఉన్న అఖిలప్రియకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు ప్రతి గురు,శుక్రవారాల్లో నంద్యాల తాలూకా పి.ఎస్.లో సంతకం చేయాలని కోర్టు సూచించింది. దీంతో ఆమె కర్నూలు మహిళా జైలు నుండి విడుదల కానున్నారు.

టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాలకు చేరుకున్న సమయంలో మే 16న భూమా అఖిలప్రియ వర్గీయులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో సుబ్బారెడ్డి గాయపడ్డారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా అఖిల ప్రియను 17న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది.

అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ కు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో భూమా అఖిలప్రియ బెయిల్ కోసం కర్నూల్ కోర్టును ఆశ్రయించారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. బెయిల్ ను మంజూరు చేసింది. ఈకేసులో అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఆమె భర్త భార్గవ్ కు..మిగిలిన నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.